High BP: మందులతో పనిలేదు.. రోజూ ఈ ఒక్క పని చేస్తే చాలు.. ఈజీగా బీపీని కంట్రోల్ చేయొచ్చు!

Control Your Blood Pressure Naturally: ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య అధిక రక్తపోటు. దీని కోసం చాలా మంది రకరకాల మందులు వాడుతుంటారు. అయితే, మందులతో పాటు రోజూ నడవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అదెలానో ఇప్పుడు తెలుసుకుందాం.

High BP: మందులతో పనిలేదు.. రోజూ ఈ ఒక్క పని చేస్తే చాలు.. ఈజీగా బీపీని కంట్రోల్ చేయొచ్చు!
Control Your Blood Pressure Naturally

Updated on: Jun 01, 2026 | 6:30 AM

మారుతున్న లైఫ్‌స్టైల్, ఆహార పదార్థాల కారణంగా జనాలు అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. వాటిలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన ఆరోగ్య సమస్య బీపీ. దీన్ని తగ్గించుకునేందుకు చాలా మంది అనేక రకాలు మందులు వాడుతారు. కానీ జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా బీపీని చాలా వేగంగా నియంత్రణలోకి తెచ్చుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో అన్నింటికంటే ముఖ్యమైనది నడక. కొద్ది దూరం నడవడం ద్వారా రక్తపోటు ఎలా తగ్గుతుంది, రోజూ ఎంత దూరం నడవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

నడకతో బీపీని ఎలా తగ్గించుకోవచ్చు

  • ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు నడవడం వల్ల రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వారంలో కనీసం 5 రోజులు ఈ విధంగా నడవాలని సూచిస్తున్నారు.
  • రోజుకు సుమారు 7,000 నుండి 10,000 అడుగులు నడవడం గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిదని. ఇది సిస్టోలిక్, డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్‌ రెండింటినీ తగ్గిస్తుందని చెబుతున్నారు.
  • ఎప్పుడో ఒకసారి నడవడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదని.. నడకను రోజువారీ అలవాటుగా మార్చుకుంటే, అది రక్తనాళాల స్థితిస్థాపకతను పెంచుతుందని. దీనివల్ల గుండె సులభంగా రక్తాన్ని పంప్ చేయగలుగుతుందని చెబుతున్నారు.

నడిచేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలు

  • మీరు ఉత్తమ ఫలితాలను పొందేందుకు నెమ్మదిగా నడవడం కంటే కాస్తా వేగంగా నడవడం వల్ల ఎక్కువ ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
  • ఒకేసారి 30 నిమిషాలు నడవలేని వారు.. ఉదయం 10 నిమిషాలు, మధ్యాహ్నం 10 నిమిషాలు, సాయంత్రం 10 నిమిషాల చొప్పున నడకను అలావాటు చేసుకోవాలని సూచిస్తున్నారు.
  • కాళ్ళపై ఎక్కువ ఒత్తిడి పడకుండా ఉండేందుకు మంచి స్పోర్ట్స్ షూస్ ఉపయోగించాలని సూచిస్తున్నారు. ఇది కీళ్ల నొప్పులను కూడా తగ్గిస్తుందని చెబుతున్నారు.

నడక వల్ల కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు

మెరుగైన రక్త ప్రసరణ: నడక వల్ల గుండె కొట్టుకునే వేగం పెరిగి, శరీరంలో రక్త ప్రసరణ సాఫీగా సాగుతుంది. ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది.

బరువు నియంత్రణ: నడవడం వల్ల శరీరంలోని క్యాలరీలు కరుగుతాయి. సరైన ఆహార నియమాలతో పాటు రోజూ నడవడం వల్ల బరువు అదుపులో ఉంటుంది.

మానసిక ఉల్లాసం: నడిచేటప్పుడు శరీరంలో ఎండార్ఫిన్లు అనే ఫీల్-గుడ్ హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి ఒత్తిడి, ఆందోళన, నిరాశను తగ్గించి మానసిక ప్రశాంతతను ఇస్తాయి.

షుగర్ కంట్రోల్: రక్తంలో చక్కెర స్థాయిలను అదుపు చేయడంలో నడక బాగా సహాయపడుతుంది. టైప్-2 డయాబెటిస్ ఉన్నవారిలో ఇన్సులిన్ పనితీరును ఇది మెరుగుపరుస్తుంది.

రోగనిరోధక శక్తి: రోజూ నడవడం వల్ల జీర్ణక్రియ సాఫీగా సాగడమే కాకుండా, శరీర రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us