
అరటిపండు.. అన్ని సీజన్లలో ప్రతిచోటా సులభంగా లభించే సూపర్‌ఫుడ్.. దీనిలో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు దాగున్నాయి.. కానీ చాలా మంది ఈ చౌకైన అరటిపండు తినడానికి ఇష్టపడరు. అరటిపండ్లు తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. రోజుకు ఒకటి లేదా రెండు అరటిపండ్లు తినడం వల్ల శరీరానికి అవసరమైన శక్తి లభించడమే కాకుండా.. గుండె ఆరోగ్యానికి మేలు చేసే అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి.. అరటిపండ్లు తినడం వల్ల కలిగే ఇతర ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..
త్వరిత శక్తినిచ్చే సహజమైన పండ్లు అరటిపండ్లు.. వాటి సహజ చక్కెర, ఫైబర్ కంటెంట్ మీకు రోజంతా అవసరమైన శక్తిని అందిస్తుంది. తద్వారా అలసట తగ్గుతుంది.
అరటిపండ్లు శరీరానికే కాదు, మనసుకు కూడా మంచివి. అరటిపండ్లలోని ట్రిప్టోఫాన్ అనే పదార్థం మంచి అనుభూతిని కలిగించే హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది మీ మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది.
ఐరన్ లోపం.. రక్తహీనత ఉన్నవారికి అరటిపండ్లు చాలా మంచివి. ఇనుము సమృద్ధిగా ఉండటం వల్ల, ఇది హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడానికి సహాయపడుతుంది.
అరటిపండు తినడం వల్ల విటమిన్ బి6, విటమిన్ సి ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది జలుబు మరియు ఫ్లూ వంటి కాలానుగుణ వ్యాధుల నుండి రక్షిస్తుంది.
అదేవిధంగా, అరటిపండ్లలోని విటమిన్ సి, చయాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. అవి ముడతలను తగ్గిస్తాయి. అంతే కాదు, ఇది ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.
గర్భిణీ స్త్రీలకు అరటిపండ్లు చాలా మంచిది. ప్రతిరోజూ రెండు అరటిపండ్లు తినడం శిశువు, తల్లి ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే.. గర్భిణుల ఆరోగ్యాన్ని బట్టి వైద్యులు సిఫార్సు చేస్తారు.. తినే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..