Baba Ramdev: జుట్టు రాలుతోందా.. షాంపూలు మార్చడం కాదు.. బాబా రామ్‌దేవ్ చెప్పిన ఈ సీక్రెట్ పాటించండి..

జుట్టు రాలుతోందని టెన్షన్ పడుతున్నారా? రకరకాల షాంపూలు, ఆయిల్స్ వాడి అలసిపోయారా? అయితే మీకు ఒక గుడ్ న్యూస్.. జుట్టు రాలడానికి అసలు కారణం మన శరీరంలోనే ఉంది అంటున్నారు యోగా గురువు బాబా రామ్‌దేవ్. ఎటువంటి కెమికల్స్ లేకుండా, ఇంట్లోనే దొరికే వాటితో జుట్టును మళ్ళీ ఒత్తుగా ఎలా పెంచుకోవాలో తెలుసుకుందాం..

Baba Ramdev: జుట్టు రాలుతోందా.. షాంపూలు మార్చడం కాదు.. బాబా రామ్‌దేవ్ చెప్పిన ఈ సీక్రెట్ పాటించండి..
Baba Ramdev Hair Fall Tips 1

Updated on: Feb 06, 2026 | 12:36 PM

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న ప్రధాన సమస్య జుట్టు రాలడం.. మార్కెట్లో దొరికే రకరకాల షాంపూలు, ఆయిల్స్ వాడినా ఫలితం లేక చాలా మంది నిరాశ చెందుతుంటారు. అయితే పతంజలి వ్యవస్థాపకులు, యోగా గురువు బాబా రామ్‌దేవ్ ప్రకారం.. జుట్టు రాలడానికి అసలు కారణం మన శరీర అంతర్గత వ్యవస్థలోనే ఉంది. దీనికి అల్లోపతి కంటే ఆయుర్వేదంలోనే శాశ్వత పరిష్కారం ఉందని ఆయన స్పష్టం చేస్తున్నారు.

జుట్టు ఎందుకు రాలుతుంది?

సాధారణంగా రోజుకు 50 నుంచి 100 వెంట్రుకలు రాలడం సహజమే. కానీ అంతకంటే ఎక్కువ రాలుతుంటే అది తీవ్రమైన సమస్యగా పరిగణించాలి. రామ్‌దేవ్ బాబా ప్రకారం..కాలేయం లేదా మూత్రపిండాలు సరిగా పనిచేయకపోతే దాని ప్రభావం చర్మం, జుట్టుపై పడుతుంది. పురుషుల్లో DHT హార్మోన్ వల్ల, మహిళల్లో PCOS లేదా గర్భధారణ తర్వాత హార్మోన్ల మార్పుల వల్ల జుట్టు రాలుతుంది. శరీరంలో ఐరన్, కెరోటిన్ అనే ప్రోటీన్ లోపిస్తే జుట్టు కుదుళ్లు బలహీనపడతాయి. మానసిక ఒత్తిడి వల్ల జుట్టు టెలోజెన్ దశకు చేరుకుని అకస్మాత్తుగా రాలిపోతుంది.

రామ్‌దేవ్ సూచించిన సహజ నివారణలు

జుట్టును తిరిగి ఆరోగ్యంగా మార్చుకోవడానికి బాబా రామ్‌దేవ్ ఈ క్రింది సులభమైన చిట్కాలను సిఫార్సు చేస్తున్నారు.

బాలాయం: జుట్టు సహజంగా పెరగడానికి రెండు చేతుల గోళ్లను ఒకదానికొకటి కలిపి రుద్దాలని ఆయన సూచిస్తున్నారు. ఇది జుట్టు కుదుళ్లకు రక్త ప్రసరణను పెంచుతుంది.

సొరకాయ – ఉసిరి రసం: ప్రతిరోజూ ఉదయం సొరకాయ రసంలో ఉసిరి రసం కలుపుకుని తాగడం వల్ల జుట్టుకు కావాల్సిన పోషకాలు అందుతాయి. ఉసిరిలో ఉండే విటమిన్-సి జుట్టును నల్లగా, బలంగా ఉంచుతుంది.

హెల్తీ జ్యూస్: సొరకాయ రసంలో కొత్తిమీర, పుదీనా ఆకులు, కొద్దిగా నిమ్మరసం కలిపి తీసుకోవచ్చు. అయితే అసిడిటీ సమస్య ఉన్నవారు నిమ్మకాయను వాడకూడదు.

ఆమ్లా మిఠాయి: ఉసిరిని ఏదో ఒక రూపంలో నిత్యం తీసుకోవడం వల్ల జుట్టు రాలడం గణనీయంగా తగ్గుతుంది.

జుట్టు రాలడం అనేది కేవలం పైకి కనిపించే సమస్య మాత్రమే కాదు.. అది శరీరంలోని లోపాల కలయిక. కాబట్టి ఖరీదైన కెమికల్ ట్రీట్‌మెంట్ల కంటే ఆయుర్వేద పద్ధతులు, సరైన ఆహారం, యోగా ద్వారా జుట్టును మళ్లీ ఒత్తుగా పెంచుకోవచ్చని స్వామి రామ్‌దేవ్ భరోసా ఇస్తున్నారు.