Mouth Odor: నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారా.. ఈ ఒక్క ఆయుర్వేద చిట్కాతో చెక్ పెట్టండి..

నోటి దుర్వాసన సమస్యతో చాలా మంది ఇబ్బంది పడతారు. అనేక కారణాల వలన నోటి దుర్వాసన సమస్య వస్తుంది. ఈ సమస్య ఉన్నవారు పదిమంది మధ్యలోకి వెళ్ళాలన్నా.. ఎవరితోనైనా మాట్లాడాలన్నా ఇబ్బంది పడతారు. కనుక ఈ సమస్య నుంచి ఉపశమనం కోసం ఆయుర్వేద చికిత్సలను ప్రయత్నించండి.

Mouth Odor: నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారా.. ఈ ఒక్క ఆయుర్వేద చిట్కాతో చెక్ పెట్టండి..
Mouth Odor
Image Credit source: pexels

Updated on: Sep 25, 2025 | 3:18 PM

నోటి దుర్వాసన సమస్యతో తరచుగా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే కొన్నిసార్లు ఈ సమస్యని పెద్దగా పట్టించుకోకుండా ఉద్దేశపూర్వకంగా దీనిని విస్మరిస్తారు. అటువంటి సమయంలో మీ దగ్గరకు రావాలంటే ఇతరులు ఇబ్బంది పడతారు. నోటి దుర్వాసన అనేది చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్య అయినా దీనికి చికిత్సను నిర్లక్ష్యం చేస్తారు. అప్పుడు సమస్య మరింత తీవ్రమై ఇతర వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సర్వసాధారణంగా నోటి దుర్వాసన నోటిలో బ్యాక్టీరియా పేరుకుపోవడం, నోటి పరిశుభ్రత సరిగా లేకపోవడం, పొగాకు వాడకం లేదా ఇతర శారీరక సమస్యల వల్ల వస్తుంది. ఈ సమస్య నుంచి బయటపడటానికి ఎవరైనా సరే చక్కటి ఆయుర్వేద పద్ధతిని ప్రయత్నించవచ్చు. అది ఏమిటంటే..

నోటి దుర్వాసనను పోగొట్టే చిట్కా

నోటి దుర్వాసన సమస్య నుంచి ఉపశమనం కోసం ఆయుర్వేద పద్ధతులను పాటించడం మంచి ఫలితాలను ఇస్తుంది. గణనీయమైన ఉపశమనం లభిస్తుంది. దీనికి కొన్ని పదార్థాలు అవసరం. ముందుగా సోంపు గింజలను నీటిలో వేసి ఉడకబెట్టండి. తరువాత.. ఆయుర్వేద ఔషధం ‘దివ్యధార’ను సోంపు నీటితో కలపండి. ఈ దివ్య ధారలో.. లవంగం నూనె, యూకలిప్టస్ నూనె , కర్పూరం ఉంటాయి. దాదాపు 400 ml సోంపు నీటిలో ఈ దివ్యధారను రెండు నుంచి మూడు చుక్కలు జోడించండి. ఇలా తయారుచేసిన మిశ్రమం సరైన పద్దతిలో నిల్వ చేసి.. ఈ నీటిని ప్రతిరోజూ పుక్కిలించండి. ఇది క్రమంగా దుర్వాసనను తొలగిస్తుంది.

నోటి దుర్వాసనను నివారించడానికి మార్గాలు

  1. నోటి దుర్వాసనను నివారించడానికి దంతాలను బాగా శుభ్రం చేసుకోవాలి. దంతాల పరిశుభ్రత సరిగా పాటించండి.
  2. సోంపు, పుదీనా, యాలకులు, లైకోరైస్, వేయించిన జీలకర్ర , కొత్తిమీర వంటి యాంటీ బాక్టీరియల్ మౌత్ ఫ్రెషనర్లను ఉపయోగించండి
  3. ధూమపానం, పొగాకు వంటి హానికరమైన పదార్థాలకు దూరంగా ఉండండి.
  4. ఉల్లిపాయలు, వెల్లుల్లి లేదా స్వీట్లు తిన్న వెంటనే నోరు శుభ్రం చేసుకోండి.

నోటి దుర్వాసన సాధారణంగా దంతాల దగ్గర ఆహార వ్యర్థాలు పేరుకుపోవడం, పొడి నోరు లేదా కొన్ని రకాల వ్యాధుల వల్ల వస్తుంది. దుర్వాసనను తగ్గించడానికి క్రమం తప్పకుండా బ్రష్ చేయడం, ఫ్లాస్ చేయడం, నాలుకను శుభ్రం చేసుకోవడం, నీళ్లు ఎక్కువగా తాగడం వంటివి చేయాలి.

 

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)