
చాలామంది బరువు పెరుగుతామనే భయంతోనో లేదా కొలెస్ట్రాల్ పెరుగుతుందనే సాకుతోనో గుడ్డులోని తెల్లసొన మాత్రమే తింటారు. కానీ, విటమిన్-డి పొందాలనుకునే వారు చేసే అతిపెద్ద తప్పు ఇదే. ఎందుకంటే.. గుడ్డులో ఉండే విటమిన్-డి మొత్తం పచ్చసొన లోనే ఉంటుంది. తెల్లసొనలో కేవలం ప్రోటీన్ మాత్రమే ఉంటుంది,విటమిన్-డి సున్నా.విటమిన్-డి అనేది ఫ్యాట్ సాల్యూబుల్ విటమిన్. అంటే, ఇది మన శరీరంలో కరగాలన్నా, రక్తంలో కలవాలన్నా దీనికి కొవ్వు తోడుండాలి. అందుకే గుడ్డును ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ ఉన్న ఆహారాలతో కలిపి తీసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
మీరు తినే గుడ్డులోని విటమిన్-డి వృథా కాకుండా ఉండాలంటే కొన్ని పదార్థాల తో కలిపి తీసుకంటే బెటర్ అని సలహా ఇస్తున్నారు నిపుణులు. ఆవకాడో లో ఉండే మోనోఅన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్ విటమిన్-డి గ్రహింపును పెంచుతాయి. గింజలు & విత్తనాలుగుడ్డుతో పాటు కొద్దిగా వాల్‌నట్స్ లేదా చియా సీడ్స్ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
చీజ్ మితంగా చీజ్ జోడించడం వల్ల రుచితో పాటు ఫ్యాట్ కంటెంట్ పెరిగి విటమిన్ అబ్సార్ప్షన్ సులభమవుతుంది. ఆలివ్ ఆయిల్ గుడ్డును ఫ్రై చేసినా లేదా ఆమ్లెట్ వేసినా తక్కువ మోతాదులో ఆలివ్ ఆయిల్ వాడటం శ్రేయస్కరం.విటమిన్-డి ఎక్కువగా అందాలంటే గుడ్డును ఉడకబెట్టి తినడం కంటే, పచ్చసొన మరీ గట్టిపడకుండా వండుకుని తింటే పోషకాలు తక్కువగా నశిస్తాయి అని అంటున్నారు నిపుణులు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..