“కరివేపాకు’ …అనుకుని తీసిపారెసారో……

|

Sep 03, 2019 | 6:18 PM

కూరలో “కరివేపాకు ‘ కదా అని అంత ఈజీగా తీసిపారేయకండి.. కరివేపాకులో ఆరోగ్య సంజీవని దాగివుందన్న రహస్యం తెలిస్తే.. దాని కోసం పరుగులు తీస్తారు..ఎన్నో పోషక విలువలు, మన ఆరోగ్యాన్ని సంరక్షించే ఎన్నో రకాల ఔషద గుణాలు కరివేపాకులో ఉన్నాయి. అటువంటి కరివేపాకును ప్రతి ఇంట్లోనూ తమ వంటల్లో ఏదో ఒక సందర్భంలో తప్పక వాడుతుంటారు. కరివేపాకు వల్ల వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. కరివేపాకులలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ […]

కరివేపాకు ...అనుకుని తీసిపారెసారో......
Follow us on

కూరలో “కరివేపాకు ‘ కదా అని అంత ఈజీగా తీసిపారేయకండి.. కరివేపాకులో ఆరోగ్య సంజీవని దాగివుందన్న రహస్యం తెలిస్తే.. దాని కోసం పరుగులు తీస్తారు..ఎన్నో పోషక విలువలు,

మన ఆరోగ్యాన్ని సంరక్షించే ఎన్నో రకాల ఔషద గుణాలు కరివేపాకులో ఉన్నాయి. అటువంటి కరివేపాకును ప్రతి ఇంట్లోనూ తమ వంటల్లో ఏదో ఒక సందర్భంలో తప్పక వాడుతుంటారు.

కరివేపాకు వల్ల వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. కరివేపాకులలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు కూడా

కరివేపాకులో ఎక్కువే. అందువల్ల ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. అంతకు మించి కరివేపాకుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఓసారి పరిశీలిద్దాం..
– కరివేపాకు జీర్ణాశయానికి రక్షణగా పనిచేస్తుంది. డయేరియాను నివారిస్తుంది.
– కరివేపాకు తినేవారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుంది.
– కరివేపాకు తినడం ద్వారా శరీరంలోని టాక్సిన్స్‌ కూడా తొలగిపోతాయి.
– రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించే పదార్థాలు కరివేపాకులో అధికంగా ఉండి..డయాబెటిస్‌ రోగులకు మేలు చేస్తుంది.
– కిడ్నీ ప్రక్షాళనకు కరివేపాకు ఎంతో మేలు చేస్తుంది.
– క్యాన్సర్‌తో ఫైట్‌ చేయగలిగే గుణాలు కూడా కరివేపాకులో ఉంటాయి.
– కళ్లకు మేలు చేస్తుంది, జుట్టు పెరుగుదలకు, చర్మ సంరక్షణకు దోహదం చేస్తుంది.
– కరివేపాకులో యాంటీ సెప్టిక్‌ గుణాలు ఉండడం వల్ల శరీరంలోపై ఎలాంటి గాయం అయినా తగ్గుముఖం పడుతుంది.
– అధిక బరువును తగ్గించడంలో కరివేపాకు ఎంతగానో మేలు చేస్తుంది. భోజనానికి ముందు కొన్ని కరివేపాకు ఆకులు అలాగే నమిలి తింటే శరీరంలో కొవ్వు చేరకుండా ఉంటుంది. అధిక

బరువు తగ్గుతారు. ఇంకా ఒక చెంచాడు తేనే, చెంచాడు కరివేపాకు రసంతో కలిపి తాగిన బరువు తగ్గుతారు.
ఇన్నీ ఔష గుణాలు కలిగి ఉన్నకరివేపాకును ఇక తీసి పారేయకండి..ఏదో ఒక రూపంలో తప్పక తినండి