
కీర దోసకాయలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. అంతేకాకుండా.. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కీర దోసకాయలు పోషకాలతో సమృద్ధిగా ఉన్నప్పటికీ, ఈ కూరగాయ అందరి ఆరోగ్యానికి తగినది కాదు. ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు.. కీర దోసకాయలు తినకూడదంటున్నారు డైటీషియన్లు.. కీర దోసకాయలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా దాగున్నాయి.. దీనిని రెగ్యులర్‌గా తినడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. కీర దోసకాయలో చాలా నీరు ఉంటుంది.. ఇది శరీరాన్ని హైడ్రేట్ చేయడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.. ఇంకా కడుపును నిండుగా ఫిట్‌గా ఉంచడంతోపాటు.. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కీర దోసకాయలోని యాంటీఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యాన్ని కాపాడతాయి..
కీర దోసకాయలు చాలా పోషకాలతో నిండి ఉంటాయి. అయితే, ఈ కూరగాయ అందరి ఆరోగ్యానికి తగినది కాదంటున్నారు డైటీషియన్లు.. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు.. కీర దోసకాయలు తినకూడదని పేర్కొంటున్నారు.
ఎలాంటి సమస్యలు ఉన్నవారు కీర దోసకాయలు తినకూడదో తెలుసుకోండి..
మూత్ర సమస్యలు: దోసకాయను సహజ మూత్రవిసర్జన పండు అని పిలుస్తారు. అందువల్ల, తరచుగా మూత్రవిసర్జన సమస్యలు ఉన్నవారు కీర దోసకాయను తక్కువగా తినాలి లేదా అస్సలు తినకూడదు. లేకపోతే, తరచుగా మూత్రవిసర్జన సమస్య మునుపటి కంటే ఎక్కువగా పెరగవచ్చు.
జలుబు, దగ్గు, జ్వరం: జలుబు, దగ్గు, జ్వరం లేదా కఫ సమస్యలు ఉన్నవారు కీర దోసకాయ తినకూడదు. దోసకాయలో చల్లబరిచే గుణాలు అధికంగా ఉన్నాయి. అందువల్ల, అనారోగ్యం సమయంలో దీనిని తినడం వల్ల ఆరోగ్యం మరింత దిగజారిపోతుంది.
అలెర్జీ: అలెర్జీ సమస్యలు ఉన్నవారు కీర దోసకాయ తినకూడదు. ఇది వాపు, కడుపు నొప్పి లేదా దురదకు కారణమవుతుంది.
కడుపు సమస్యలు: కడుపు సమస్యలు ఉన్నవారు కీర దోసకాయను ఎక్కువగా తినకూడదు. ఇందులో ఫైబర్ ఉంటుంది. కాబట్టి, తక్కువ పరిమాణంలో తినడం ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే, ఎక్కువగా తినడం వల్ల అజీర్ణం, గ్యాస్ లేదా ఉబ్బరం వస్తుంది.
గమనిక: ఈ సమాచారం ఆరోగ్య నిపుణుల అభిప్రాయాల ప్రకారం ఇవ్వడమైంది. మీకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే.. ఆరోగ్య నిపుణులను సంప్రదించడం ఉత్తమం..
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..