Aloe Vera for Diabetes: రోజూ షుగర్ పేషెంట్స్ మెడిసిన్ వేసుకుంటున్నారా ? కలబంద టీ, కూర ట్రై చేసి చూడండి

|

Jun 25, 2024 | 12:49 PM

కలబందలో వివిధ రసాయన సమ్మేళనాలు ఉన్నాయి. ఈ పదార్థాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. ప్రాథమికంగా ఈ రసాయనాలు ప్యాంక్రియాస్ నుంచి ఉత్పత్తి అయ్యే ఇన్సులిన్ హార్మోన్ స్రావాన్ని నియంత్రిస్తాయి. అలాగే కణాలను దెబ్బతినకుండా కాపాడుతాయి. శారీరక మంటను తగ్గిస్తాయి. షుగర్ పేషెంట్స్ కలబందను తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. అయితే ఏ విధంగా కలబండను తినే ఆహారంలో చేర్చుకోవాలో ఈ రోజు తెలుసుకుందాం..

Aloe Vera for Diabetes: రోజూ షుగర్ పేషెంట్స్ మెడిసిన్ వేసుకుంటున్నారా ? కలబంద టీ, కూర ట్రై చేసి చూడండి
Aloe Vera For Diabetes
Follow us on

ప్రతి ఇంట్లో ఉండే మొక్క కలబంద. అందాన్ని , ఆరోగ్యాన్ని ఇచ్చే కలబంద గురించి ఎంత చెప్పినా తక్కువే అంటారు నిపుణులు. సౌందర్య ఉత్పత్తుల తయారీ కోసం మాత్రమే కాదు.. షుగర్ వంటి అనేక వ్యాధులకు చికిత్సగా కలబందను ఉపయోగిస్తున్నారు. ముఖానికి క్రీమ్ గా అలోవేరా జెల్ ను ఉపయోగిస్తున్నారు. చిన్న చిన్న గాయాలు అయ్యినా, చర్మంపై దురద, దద్దుర్లు వచ్చినా వెంటనే కలబంద మొక్కవైపు పరుగులు పెడతారు. కలబందను చాలా కాలంగా సౌందర్య చికిత్సల కోసం ఉపయోగిస్తున్నారు. అయితే కలబంద ప్రయోజనాలు ఇక్కడ వరకు మాత్రమే పరిమితం కాదు. దీనిలో ఆరోగ్యానికి మేలు చేసే అనేక సుగునలున్నాయి. ముఖ్యంగా, కలబంద సారం మధుమేహ రోగులకు బెస్ట్ మెడిసిన అని అంటున్నారు.

కలబందలో వివిధ రసాయన సమ్మేళనాలు ఉన్నాయి. ఈ పదార్థాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. ప్రాథమికంగా ఈ రసాయనాలు ప్యాంక్రియాస్ నుంచి ఉత్పత్తి అయ్యే ఇన్సులిన్ హార్మోన్ స్రావాన్ని నియంత్రిస్తాయి. అలాగే కణాలను దెబ్బతినకుండా కాపాడుతాయి. శారీరక మంటను తగ్గిస్తాయి. షుగర్ పేషెంట్స్ కలబందను తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. అయితే ఏ విధంగా కలబండను తినే ఆహారంలో చేర్చుకోవాలో ఈ రోజు తెలుసుకుందాం..

అలోవెరా జ్యూస్ : ఉదయాన్నే ఖాళీ కడుపుతో కలబంద రసం తాగండి. కలబంద సారాన్ని తీసి బ్లెండర్‌లో కలపండి. నీళ్లు, ఉప్పు, నిమ్మరసం మిక్స్ చేసి జ్యూస్ గా తయారు చేసుకోండి. ఈ జ్యూస్ కు కీరదోస ను లేదా పైనాపిల్ రసం కూడా జోడించవచ్చు.

ఇవి కూడా చదవండి

అలోవెరా స్మూతీస్ : చాలా మంది కలబందను రుచి చూసి తినకూడదనుకుంటారు. అలాంటప్పుడు స్మూతీ చేసి తినొచ్చు. స్ట్రాబెర్రీలు, ఆరెంజ్‌లతో కలబందను కలపడం ద్వారా స్మూతీని తయారు చేసుకోవచ్చు. ఈ పానీయం డయాబెటిక్ రోగులకు ఉపయోగపడుతుంది.

కలబంద కూర: కలబంద ఆకులను కట్ చేసి బాగా కడగాలి. పసుపు భాగం రాగానే కలబంద ఆకులను ముక్కలుగా కోయాలి. ఇప్పుడు కలబందను ఉప్పు, పసుపు వేసి ఆవిరి మీద ఉడికించాలి. 8-10 నిమిషాలు ఉడకబెట్టండి. తరువాత కలబంద నీటిని వడకట్టండి. బాణలిలో నూనె వేడి చేయండి. అందులో జీలకర్ర, ఆవాలు, ఇంగువ, పచ్చిమిర్చి వేసి వేయించండి. తర్వాత అందులో ఉడికించిన కలబంద ముక్కలను వేయాలి. తర్వాత పసుపు, ధనియాల పొడి, మెంతిపొడి, మామిడి పొడి, రుచికి సరిపడా ఉప్పు వేయాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా కలిపి కొంచెం సేపు వేయిస్తే కలబంద కూర సిద్ధం. కలబంద కూర అన్నం లేదా రొట్టెలతో కలిపి తినవచ్చు.

కలబంద టీ : మధ్యాహ్నం కలబంద టీని త్రాగవచ్చు. ఒక దళసరి గిన్నె తీసుకుని అందులో నీరు పోసి వేసి చేసి.. ఆ వేడి నీటిలో ఒక చెంచా అల్లం రసం, ఒక చెంచా కలబంద రసం కలపండి. నీరు మరిగేటప్పుడు.. దానికి అలోవెరా జెల్ జోడించండి. అప్పుడు గ్యాస్ ఆఫ్ చేయండి. కలబంద టీ సిద్ధం. ఈ టీ బరువును అదుపులో ఉంచుతుంది. అజీర్తిని నయం చేస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను సూచనలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)