AHA OTT: ఆసక్తికరమైన కంటెంట్‌తో తెలుగు ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా(AHA OTT). ఓవైపు సూపర్‌హిట్ సినిమాలు, వెబ్‌సిరీస్‌లతో అలరిస్తూనే మరోవైపు ఇండియన్ ఐడల్స్, అన్‌స్టాపబుల్ వంటి టాక్‌షోలతో ప్రేక్షకులకు సరిపడా ఫన్ అందిస్తోంది. ఈక్రమంలోనే వంట ప్రియుల కోసం ప్రత్యేకంగా చెఫ్‌మంత్ర (Chef Mantra) పేరుతో స్పెషల్ ఛాట్ షోను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రముఖ యాంకర్ శ్రీముఖి(Anchor Sreemukhi) ఈ టాక్‌షోకు హోస్ట్‌గా వ్యవహరించారు. ఆహా ఇన్ హౌస్ క్రియేటివ్ టీమ్ డెవలప్ చేసిన తొలి టాక్ షో ఇది. మొదటి సీజన్‌లో ప్రసారమైన మొత్తం 8 ఎపిసోడ్‌లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. తెలుగు సినిమా రంగంలోని పలువురు ప్రముఖులతో పాటు వారి అభిమాన చెఫ్స్ కలిపి ఈ షోకు హాజరయ్యారు. ఇష్టమైన వంటలను చేయడమే కాకుండా, వారి ప్రయణంలోని మధుర జ్ఞాపకాలను ఈ ఛాట్‌షోలో గుర్తు చేసుకున్నారు. కాగా ఈ ఎపిసోడ్‌లు ఇప్పుడు మళ్లీ టీవీ 9 ఎంటర్టైన్మెంట్(TV9 Entertainment) యూట్యూబ్ ఛానల్‌లో వరుసగా ప్రసారమవుతున్నాయి.
హీరోయిన్ రెజీనా కాసాండ్రా, శ్రియాశరణ్, సుహాస్, అడివిశేష్ లాంటి సెలబ్రిటీలు వరుసగా ఈ ఛాట్‌షోలకు హాజరై తమ అనుభవాలను పంచుకున్నారు. ఇక ఐదో ఎపిసోడ్‌కు యంగ్ హీరోయిన్, అలా వైకుంఠపురం ఫేమ్ నివేదా పేతురాజ్ హాజరైంది. ఈ కార్యక్రమానికి తన తమ్ముడు నిషాంత్ కూడా పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తమకిష్టమైన మాష్ పొటాటో డిష్‌ను తయారుచేసి శ్రీముఖితో తినిపించారు. ఇదే కార్యక్రమంలో తన వృత్తి, వ్యక్తిగత జీవితానికి సంబంధించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకుంది నివేద. మరి ఇలా ఇద్దరి సంభాషణలతో ఎంతో ఆసక్తికరంగా సాగిన చెఫ్‌మంత్ర-5 ఎపిసోడ్‌ను మీరు ఓసారి చూసేయండి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..