
చాలా మందికి ఉదయం టీ అనేది కేవలం ఒక డ్రింక్ కాదు.. అది వారి రోజువారీ దినచర్యలో భాగం. నిద్ర లేవగానే టీ తాగితే మైండ్ రీఫ్రెష్, శరీరానికి శక్తి వస్తుందని చాలా మంది అనుకుంటారు. కొందరికి బెడ్ టీ అంటే ఇష్టం. అయితే ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగడం కొంతమందికి ఆరోగ్యానికి హానికరం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీరు కూడా ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగే అలవాటు ఉన్నవారైతే, ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాలి. రోజు మనం ఉదయం నిద్ర లేచిన వెంటనే టీ తాగకూడని 7 రకాల వ్యక్తులు, దాని వెనుక ఉన్న కారణాలను వివరంగా చూద్దాం.
టీ అనేది ప్రాసెస్ చేసిన టీ ఆకులు, వీటిలో కెఫిన్ ఉంటుంది. టీ తయారుచేసేటప్పుడు.. దానికి పాలు, చక్కెర జోడించబడతాయి.ఈ కెఫిన్, చక్కెర కలయికే ఉదయం టీ కోరికను పెంచుతుంది. నిజానికి ఇది మీ జీవక్రియకు శక్తిని ఇవ్వడం కంటే చక్కెర, కెఫిన్ సృష్టించిన అలవాటు మాత్రమే. ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల కలిగే ప్రధాన నష్టాలు ఇక్కడ ఉన్నాయి.
జీర్ణక్రియ సమస్యలు: టీలోని కెఫిన్, టానిన్* జీర్ణ రసాల స్రావాన్ని ప్రభావితం చేస్తాయి. ది ఆహారం జీర్ణం కావడాన్ని కష్టతరం చేసి, దీర్ఘకాలంలో కడుపు సమస్యలను పెంచుతుంది.
గుండెల్లో మంట – గ్యాస్: ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల కడుపులో ఆమ్ల స్థాయిలు పెరుగుతాయి. ఇది గుండెల్లో మంట, అజీర్ణం లేదా గ్యాస్‌కు కారణమవుతుంది. ఇప్పటికే అసిడిటీ సమస్యలు ఉన్నవారు దీనిని పూర్తిగా మానుకోవాలి.
ఒత్తిడి పెరుగుదల: ఖాళీ కడుపుతో టీ తాగితే, అందులోని కెఫిన్ శరీరంలో వేగంగా శోషించబడుతుంది. దీనివల్ల కొంతమందికి హృదయ స్పందన రేటు పెరగడం లేదా విశ్రాంతి లేకపోవడం జరిగి ఆందోళన ఒత్తిడికి దారితీస్తుంది.
రక్తంలో చక్కెర స్థాయి హెచ్చుతగ్గులు: ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగడం లేదా తగ్గడం జరుగుతుంది.ఇది డయాబెటిక్ రోగులకు చాలా ప్రమాదకరం.
మీరు మీ కడుపును ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకున్నా లేదా పైన పేర్కొన్న ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నా.. ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగే అలవాటును మార్చుకోవడం మంచిది. ఆరోగ్యకరమైన రోజును ప్రారంభించడానికి ప్రత్యామ్నాయ పానీయాలు లేదా అల్పాహారాన్ని ఎంచుకోవడం శ్రేయస్కరం.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..