
చాణక్యుడు శత్రువులను ఎలా గుర్తించాలి, మంచివారిని ఎలా సహచరులుగా నిలుపుకోవాలి అనే విషయాల్లో స్పష్టమైన మార్గదర్శనం ఇచ్చాడు. అతి నిజాయితీ, అలస్యంగా నిర్ణయాలు తీసుకోవడం, సమయాన్ని వృథా చేయడం ప్రమాదకరం అని ఆయన చెబుతాడు. కాబట్టి చాణక్యుడి జ్ఞానాన్ని అనుసరించి తెలివిగా ఆలోచించి ముందుకు సాగితే విజయాన్ని సులభంగా సాధించవచ్చు.
ఏ పని మొదలు పెట్టే ముందు అయినా సరే మనం మూడు ప్రశ్నలు వేసుకోవాలి. ఆ పని ఎందుకు చేస్తున్నాం..? దాని ఫలితం ఏంటి..? దాని వల్ల విజయం వస్తుందా..? ఇలా ఆలోచించి పని చేస్తే విజయం సాధించవచ్చు.
మనం మరీ ఎక్కువ నిజాయితీగా ఉండకూడదు. ఎందుకంటే నిజాయితీగా ఉంటే ఇబ్బందులు వస్తాయి. నిటారుగా ఉన్న చెట్లను ముందుగా నరికేస్తారు. నిజాయితీగా ఉన్న వాళ్లను మోసం చేస్తారు. కాబట్టి ఎక్కడ ఎంత నిజాయితీగా ఉండాలో తెలుసుకోవాలి.
సమయం ఒకసారి పోతే తిరిగి రాదు. కాబట్టి సమయాన్ని తెలివిగా వాడుకోవాలి. సమయాన్ని వృథా చేయకుండా పని చేస్తే విజయం సాధించవచ్చు.
ఒక తెలివైన వ్యక్తి ముందుగా ఎదుటివాళ్ళ స్థానంలో ఉండి ఆలోచించాలి. ఆ తర్వాతే మాట్లాడాలి లేదా పని చేయాలి. ఇలా చేయడం వల్ల ఎదుటివారిని అర్థం చేసుకోవచ్చు.
ప్రపంచం ఒక అడవి లాంటిది. భయపడితే నిన్ను తినేస్తారు. కాబట్టి ధైర్యంగా ఉండాలి. ఎలాంటి పరిస్థితిలోనైనా మార్పుకు తగ్గట్టుగా ఉండాలి.
వంద సాధారణ పనుల కంటే ఒక మంచి పని ఎప్పుడూ గొప్పదే. కాబట్టి ఎక్కువ పనులు చేయడం కంటే తక్కువ పనులు అయినా నాణ్యతగా చేయాలి.
చదువు మనకు మంచి స్నేహితుడు. చదువుకున్న వాళ్ళను అందరూ గౌరవిస్తారు. కాబట్టి నిరంతరం నేర్చుకుంటూ ఉండాలి.
ఏదైనా ఎక్కువైతే మంచిది కాదు. కాబట్టి అతిగా పని చేయకూడదు. పనితో పాటు విశ్రాంతి తీసుకోవడం కూడా చాలా అవసరం.
మనిషి పుట్టుకతో కాదు. చేసే పనులతో గొప్పవాడు అవుతాడు. కాబట్టి అందరితో మంచిగా ఉండాలి. మంచి సంబంధాలు ఏర్పరచుకోవాలి.
మన రహస్యాలను ఎవరికీ చెప్పకూడదు. ఎందుకంటే అది మనల్ని నాశనం చేస్తుంది. ఒత్తిడిలో ప్రశాంతంగా ఉండడం చాలా ముఖ్యం. ఈ సూత్రాలను పాటిస్తే జీవితంలో విజయం సాధించవచ్చు.