Running: మీ మెదడు పనితీరు అద్భుతంగా ఉండాలంటే.. రోజూ ఉదయం పూట 10 నిముషాలు ఇలా చేయండి..

|

Sep 06, 2022 | 12:39 PM

రోజూ సులువుగా చేయదగిన శారీరక ఎక్స్‌ర్‌సైజుల్లో రన్నింగ్‌ ఒకటి. రోజూ 10 నిముషాలపాటు రన్నింగ్‌ చేస్తే శారీరక ఆరోగ్యంతోపాటు..

Running: మీ మెదడు పనితీరు అద్భుతంగా ఉండాలంటే.. రోజూ ఉదయం పూట 10 నిముషాలు ఇలా చేయండి..
Running Benefits
Follow us on

Mental Health Benefits of Running : రోజూ సులువుగా చేయదగిన శారీరక ఎక్స్‌ర్‌సైజుల్లో రన్నింగ్‌ ఒకటి. రోజూ 10 నిముషాలపాటు రన్నింగ్‌ చేస్తే శారీరక ఆరోగ్యంతోపాటు మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని తాజా అధ్యయనాలు వెల్లడించాయి. రన్నింగ్ మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని పరిశోధకులు చెబుతున్నారు. రన్నింగ్‌ వల్ల మెదడులోని బైలేటరల్‌ యాంటీరియర్‌ కోర్‌టెక్స్‌కు రక్త ప్రసరణ జరిగి ప్రేరేపితమవుతుందట. మెదడులోని ఈ భాగం మూడ్‌, ఎగ్జిక్యూటివ్‌ ఫంక్షన్లను జరపడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. అందువల్లనే మానసిక సమస్యలతో బాధపడేవారిని రోజు ఉదయం పూట 10 నిముషాల పరుగు అవసరమని నిపుణులు అంటున్నారు. మెదడులో భారీ మొత్తంలో డేటా స్టోర్‌ అయి స్తబ్ధంగా ఉంటుంది. రన్నింగ్ చేయడం వల్ల యాంటీరియర్‌ కోర్‌టెక్స్‌ యాక్టివేట్‌ అయ్యి రక్త ప్రసరణను ప్రేరేపిస్తుంది. ఇలా జరగడం మూలంగా మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని పరిశోధనలు నిరూపించాయి.

రన్నింగ్‌ ఏ విధంగా చేయాలంటే..
రన్నింగ్‌కు అనుకూలంగా ఉండే షూలను ఎంచుకోవాలి. క్రమంగా ప్రతి వారం రన్నింగ్‌ చేసే దూరాన్ని పెంచుకుంటూ పోవాలి. శరీర ఆకృతిని బట్టి ఎంత దూరం పరుగెత్తగలరు అనే విషయాన్ని నిర్ణయించుకోవాలి. ఇప్పటి వరకు రన్నింగ్‌ అనుభవం లేకపోతే రోజుకు 20 నుంచి 30 నిముషాల రన్నింగ్‌తో ప్రారంభించాలి. రన్నింగ్‌కు ఎంచుకునే ప్రదేశాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. జనావాస ప్రాంతాలను మత్రమే ఎప్పుడూ ఎంచుకోవాలి. అలాగే ఉదయం లేదా రాత్రి సమయంలో రన్నింగ్‌ చేసేటప్పడు బ్రైట్‌ కలర్ టీ షర్ట్‌లను ధరించడం మర్చిపోకూడదు. తొలుత నెమ్మదిగా నడవడంతో ప్రారంభించి క్రమంగా మెల్లగా రన్నింగ్‌ చేయవచ్చు.