తెలంగాణ వర్షాలపై స్పందించిన యువరాజ్ సింగ్

తెలంగాణ భారీ వర్షాల నుంచి బయటపడాలని చాలా మంది సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ చేస్తున్నారు. తాజాగా టీమిండియా మాజీ డాషింగ్‌ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలపై ట్విటర్‌లో స్పందించాడు...

తెలంగాణ వర్షాలపై స్పందించిన యువరాజ్ సింగ్

Edited By:

Updated on: Oct 15, 2020 | 9:14 PM

Yuvraj Singh : భారీ వర్షాలు, వరదలతో హైదరాబాద్‌ అతలాకుతలమైపోయింది. చెరువులు, నాలాలు పొంగడంతో నగర వీధులన్నీ నదులను తలపిస్తున్నాయి. వందలాది కాలనీలు, బస్తీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇళ్లు, ఆపార్టుమెంట్‌ సెల్లార్లు మీట మునగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే… తెలంగాణ భారీ వర్షాల నుంచి బయటపడాలని చాలా మంది సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ చేస్తున్నారు. తాజాగా టీమిండియా మాజీ డాషింగ్‌ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలపై ట్విటర్‌లో స్పందించాడు.

తెలంగాణలో భారీ వర్షాలు త్వరలో తగ్గిపోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా. దేవుని దయ వల్ల ఎక్కువ నష్టం జరగలేదు. అత్యవసర విభాగానికి చెందిన కార్మికులు వరద నీటిలో తమ విధులు నిర్వహిస్తున్నారు. వారికి ఇదే నా సెల్యూట్‌. ఎంత కష్టం వచ్చినా బాధిత ప్రాంతాల ప్రజలకు ఉపశమనం కలిగించడానికి తమ వంతు కృషి చేస్తున్నారు. ఈ వర్షాల వల్ల ప్రాణాలు కోల్పోయిన వారికి, బాధిత కుటుంబాల కోసం నేను ప్రార్థిస్తున్నాను. దయచేసి ఏ ఒక్కరు బయటకు రాకుండా ఇంట్లోనే ఉంటూ సురక్షితంగా ఉండాలని అభ్యర్థిస్తున్నాను అంటూ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.