గెలిచినా, ఓడినా నేను మీ వాడినే

గెలిచినా.. గెలవకపోయినా.. నేను ఎప్పటికీ విజయవాడ ప్రజల మనిషినే అన్నారు వైసీపీ నుంచి బెజవాడ ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగి ఓటమిపాలైన పీవీపీ. ఎన్నికల ఫలితాలపై విజయవాడలో ఆయన  మీడియాతో మాట్లాడారు.  విజయవాడ పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. విజయవాడ పార్లమెంట్ పరిధిలో ప్రతీ ఇంటికి  తనతో పాటు, స్థానిక ఎమ్మెల్యేలు అందుబాటులో ఉంటారని చెప్పారు. 130 స్ధానాలకు పైగా వైసీపీ గెలుస్తుందని అనేక సార్లు తాను చెప్పినా ఎవరూ నమ్మలేదన్న పీవీపీ.. […]

గెలిచినా, ఓడినా నేను మీ వాడినే

Updated on: May 25, 2019 | 1:08 PM

గెలిచినా.. గెలవకపోయినా.. నేను ఎప్పటికీ విజయవాడ ప్రజల మనిషినే అన్నారు వైసీపీ నుంచి బెజవాడ ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగి ఓటమిపాలైన పీవీపీ. ఎన్నికల ఫలితాలపై విజయవాడలో ఆయన  మీడియాతో మాట్లాడారు.  విజయవాడ పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. విజయవాడ పార్లమెంట్ పరిధిలో ప్రతీ ఇంటికి  తనతో పాటు, స్థానిక ఎమ్మెల్యేలు అందుబాటులో ఉంటారని చెప్పారు. 130 స్ధానాలకు పైగా వైసీపీ గెలుస్తుందని అనేక సార్లు తాను చెప్పినా ఎవరూ నమ్మలేదన్న పీవీపీ.. 151 స్థానాలతో వైసీపీ ప్రభంజనం సృష్టించడం ఆనందంగా ఉందన్నారు. చాలా తక్కువ ఓట్లతోనే ఓడిపోయానన్న ఆయన..కేవలం 19 రోజులే పార్లమెంట్ పరిధిలో తిరిగానని… ముందు వచ్చి ఉంటే భారీ మెజార్టీతో గెలిచేవాడినన్నారు. ఇక నుండి రెగ్యులర్ గా విజయవాడ ప్రజలతోనే ఉంటానని ప్రకటించారు.

Follow Us