వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మళ్లీ టీడీపీ అధినేత చంద్రబాబుపై సంచలన ఆరోపణలకు దిగారు. అంతర్వేది రథం దగ్ధం ఘటనలో హైదరాబాదు, గుంటూరు వ్యక్తుల ప్రమేయం ఉన్నట్టు పోలీసులు గుర్తించారని.. ఈ వ్యవహారంలో ప్రతిపక్ష నేత బాబు, ఆయన అనుచరగణం కుట్ర ఉందని ఆరోపించారు. ఈ ఘటన వెనుక పెదబాబు, చినబాబు హస్తం ఉందన్న విషయం విచారణలో బయటపడుతుందని తెలిపారు. బాబు హైదరాబాదులో ఉంటూ ఏపీలో అలజడులు సృష్టించాలని చూస్తున్నారని పేర్కొన్నారు. చంద్రం… మళ్లీ దళిత రాజకీయం మొదలుపెట్టావా? అంటూ ట్విట్టర్లో సెటైర్లు వేశారు. సీఎం జగన్ శ్రీకారం చుట్టిన వైఎస్సార్ ఆసరా నుంచి ప్రజల దృష్టి మరల్చడమే మీ కుతంత్రం కాదా అని వ్యంగ్యం ప్రదర్శించారు. కానీ మీ కుట్ర విఫలం… వైఎస్సార్ ఆసరా సఫలం అంటూ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. మళ్లీ వినండి… మాట నిలబెట్టుకుంటూ సీఎం జగన్ తొలి విడతలో రూ.6,792 కోట్లు అక్కచెల్లెమ్మల ఖాతాలో జమ చేశారని విజయసాయి సెటైరికల్ కామెంట్లు పెట్టారు.
చంద్రం..మళ్ళీ దళిత రాజకీయం మొదలుపెట్టావా?సీఎం జగన్ గారు శ్రీకారం చుట్టిన”‘వైఎస్సార్ ఆసర’ నుండి ప్రజల ద్రుష్టి మరల్చడమే మీ కుతంత్రం కదా?కానీ మీ కుట్ర విఫలం.‘వైఎస్సార్ ఆసర’ సఫలం. మళ్ళీ వినండి..మాట నిలబెట్టుకొని తొలి విడతలో రూ.6,792 కోట్లు అక్కచెల్లమ్మల ఖాతాలో జమ చేసిన జగన్ గారు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) September 12, 2020