పార్లమెంట్ సమావేశాల్లో వైసీపీ వ్యూహం ఇదీ..

|

Sep 14, 2020 | 6:51 PM

సోమవారం నుంచి మొదలైన పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన.. ప్రస్తావించాల్సిన అంశాలపై సీఎం జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఎంపీలకు మార్గనిర్దేశం చేశారని ఆపార్టీ లోక్ సభ నేత మిథున్ రెడ్డి చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశం..

పార్లమెంట్ సమావేశాల్లో వైసీపీ వ్యూహం ఇదీ..
Follow us on

సోమవారం నుంచి మొదలైన పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన.. ప్రస్తావించాల్సిన అంశాలపై సీఎం జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఎంపీలకు మార్గనిర్దేశం చేశారని ఆపార్టీ లోక్ సభ నేత మిథున్ రెడ్డి చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశం, పోలవరం ప్రాజెక్టు బకాయిలు, నిర్వాసితులకు నష్టపరిహారం, జిఎస్టి పెండింగ్ బకాయిలు, గరీబ్ కళ్యాణ్ కింద రాష్ట్రానికి నిధులు వచ్చేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ముఖ్యమంత్రి చెప్పారని మిధున్ రెడ్డి అన్నారు. ఈ అంశాలపై త్వరలోనే కేంద్ర మంత్రులను కలుస్తామన్నారు. జనాభా ప్రాతిపదికన ప్రతి పార్లమెంటు నియోజకవర్గాల్లో మెడికల్ కాలేజీ పెట్టేలా సీఎం నిర్ణయం తీసుకున్నారని.. దీనికోసం మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కేంద్రం మద్దతు కోరతామని చెప్పారు. సాలూరులో గిరిజన విశ్వవిద్యాలయం ఉంటే గిరిజనులకు లాభం ఉంటుందని ఎంపీ పేర్కొన్నారు. దిశా బిల్లు, కౌన్సిల్ రద్దు బిల్లుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాలని కోరతామన్నారు. రఘురామకృష్ణంరాజుపై త్వరితగతిన అనర్హత వేటు వేయాలని.. పిటిషన్ పై వేగంగా చర్య తీసుకోవాలని కోరతామన్నారు. అయితే, ఆయనను తాము సస్పెండ్ చేయమని.. వైయస్సార్ కాంగ్రెస్.. ఎంపీ రఘురామరాజుకు పూర్తి గౌరవం ఇచ్చిందని మిథున్ రెడ్డి చెప్పుకొచ్చారు.