మహిళలు, చిన్నారుల కోసం ‘వైఎస్సార్ సంపూర్ణ పోషణ’కు శ్రీకారం.!

|

Aug 27, 2020 | 3:41 PM

సంక్షేమమే ధ్యేయంగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన సెప్టెంబర్ 1వ తేదీన 'వైఎస్సార్ సంపూర్ణ పోషణ' పధకాన్ని ప్రారంభించనున్నారు.

మహిళలు, చిన్నారుల కోసం వైఎస్సార్ సంపూర్ణ పోషణకు శ్రీకారం.!
Follow us on

సంక్షేమమే ధ్యేయంగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన సెప్టెంబర్ 1వ తేదీన ‘వైఎస్సార్ సంపూర్ణ పోషణ’ పధకాన్ని ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని తాజాగా మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ అనురాధ వెల్లడించారు. 77 గిరిజన మండలాల్లో సంపూర్ణ పోషణ్‌ ప్లస్, మిగిలిన మండలాల్లో సంపూర్ణ పోషణ్‌ పధకాన్ని అమలు చేయబోతున్నట్లు పేర్కొన్నారు.

గర్భిణీలు, బాలింతలు, పిల్లల్లో రక్త హీనతను నివారించేందుకు ఈ పధకం ప్రవేశపెడుతున్నామన్నారు. ఈ పధకం ద్వారా సుమారు 30 లక్షల మందికి పౌష్టికాహారం అందిస్తామన్నారు. దీని కోసం రూ.1863 కోట్లు కేటాయించామని స్పష్టం చేశారు. అలాగే సెప్టెంబర్ నుంచి ఇంటికే రేషన్ డెలివరీ చేస్తామన్నారు. ఇక అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రీ-ప్రైమరీ విద్యను కూడా ప్రవేశపెట్టబోతున్నట్లు అనురాధ తెలిపారు.

Also Read: 

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇంటర్ పరీక్ష రాయకున్నా పాస్.!

గుడ్ న్యూస్.. ఒక్క ఓటీపీతో ప్రీపెయిడ్ నుంచి పోస్ట్‌పెయిడ్‌కి..

తండ్రి కాబోతున్న విరాట్ కోహ్లీ..