నిన్నంతా ఢిల్లీలో బిజీబిజీగా గడిపిన జగన్.. ఇవాళ అమరావతికి వస్తారు. తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. అక్కడ పార్టీ ముఖ్య నేతలతో సమావేశమై.. రాత్రికి పులివెందులకు వెళ్లనున్నారు. మంగళవారం వేంపల్లిలోని ఇడుపుల పాయలో తండ్రి రాజశేఖర్ రెడ్డి సమాధికి నివాళులర్పించనున్నారు. అనంతరం గండి ఆంజనేయస్వామి వారిని దర్శించుకుని అనంతరం పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. అలాగే.. కడప పెద్ద దర్గాను కూడా సందర్శిస్తారు. ఆ తరువాత సాయంత్రం తిరుమలకు వెళ్లనున్న జగన్.. బుధవారం పొద్దున్నే శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఇక 30న విజయవాడలో ప్రమాణ స్వీకారం చేయనున్న జగన్.. ఆ తరువాత తెలంగాణ సీఎం కేసీఆర్‌తో కలిసి మోదీ ప్రమాణస్వీకారం కోసం ఢిల్లీకి బయలుదేరనున్నారు.