శ్రీవారిని దర్శించుకున్న వైఎస్‌ జగన్‌

|

May 29, 2019 | 9:44 AM

తిరుమల: ఆంధ్రప్రదేశ్‌‌కు కాబోయే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సంప్రదాయ వస్త్రాలు, తిరునామం ధరించి తిరుమల ఆలయానికి వచ్చిన వైఎస్‌ జగన్‌కు ఆలయ అర్చకులు, టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ మార్గం ద్వారా వైఎస్‌ జగన్‌ ఏడుకొండలపై కొలువై ఉన్న కలియుగ వైకుంఠనాథుడిని దర్శించారు. వైఎస్‌ జగన్‌ ఏ కార్యక్రమమైనా చేపట్టేముందు భగవంతుని ఆశీర్వాదం తీసుకోవడం ఆనవాయితీ. ఈ నెల 30న సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో […]

శ్రీవారిని దర్శించుకున్న వైఎస్‌ జగన్‌
Follow us on

తిరుమల: ఆంధ్రప్రదేశ్‌‌కు కాబోయే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సంప్రదాయ వస్త్రాలు, తిరునామం ధరించి తిరుమల ఆలయానికి వచ్చిన వైఎస్‌ జగన్‌కు ఆలయ అర్చకులు, టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ మార్గం ద్వారా వైఎస్‌ జగన్‌ ఏడుకొండలపై కొలువై ఉన్న కలియుగ వైకుంఠనాథుడిని దర్శించారు. వైఎస్‌ జగన్‌ ఏ కార్యక్రమమైనా చేపట్టేముందు భగవంతుని ఆశీర్వాదం తీసుకోవడం ఆనవాయితీ. ఈ నెల 30న సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో ముందుగా ఆయన శ్రీవారి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు పలువురు ఆయన వెంట ఉన్నారు.