ప్రకాశం జిల్లా : కూతుర్ని ప్రేమించాడనే ఆగ్రహంతో యువకుడిని రప్పించి కత్తితో దాడిచేసిన తండ్రి

|

Dec 23, 2020 | 12:01 PM

ప్రకాశం జిల్లాలో మరో దారుణం జరిగింది. తమ కూతుర్ని ప్రేమించాడనే ఆగ్రహంతో సాయి మణికంఠ అనే యువకుడిపై కత్తితో దాడికి దిగాడు యువతి తండ్రి...

ప్రకాశం జిల్లా : కూతుర్ని ప్రేమించాడనే ఆగ్రహంతో యువకుడిని రప్పించి కత్తితో దాడిచేసిన తండ్రి
Follow us on

ప్రకాశం జిల్లాలో మరో దారుణం జరిగింది. తమ కూతుర్ని ప్రేమించాడనే ఆగ్రహంతో సాయి మణికంఠ అనే యువకుడిపై కత్తితో దాడికి దిగాడు యువతి తండ్రి. ఈ ఘటనలో మణికంఠ తల, చేతికి చిన్నపాటి గాయాలయ్యాయి. ప్రస్తుతం మణికంఠ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పంగులూరు గ్రామానికి చెందిన సాయి మణికంఠ..అదే గ్రామానికి చెందిన ఇంటర్‌ సెకండియర్‌ విద్యార్థిని అంజలి ప్రేమించుకుంటున్నారు. మణికంఠ హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తుండగా..అంజలి ఫ్యామిలీ అద్దంకిలో ఉంటోంది. ఐతే ఇద్దరూ ఫోన్‌లో మాట్లాడుకోవడం..చాటింగ్‌ చేసుకోవడం గమనించిన అంజలి తండ్రి..మణికంఠను అద్దంకికి పిలిపించమని కూతురికి నమ్మబలికాడు. తండ్రి మాటలు నమ్మిన అంజలి..మణికంఠను అద్దంకికి పిలిపించింది. ఐతే మణికంఠ అద్దంకి బస్టాండ్‌కి రాగానే..ఒక్కసారిగా కత్తితో దాడికి దిగాడు అంజలి తండ్రి శ్రీను. ఈ ఘటనలో మణికంఠకు తల, చేతికి గాయాలయ్యాయి.