అదిగో యతి.. పాదముద్రలు.. నిజమేనా..?

| Edited By:

Apr 30, 2019 | 12:08 PM

నిజంగానే మంచు మనిషి ఉన్నాడా..! ఇలాంటివి పురాణాల్లో వినడమో లేక పాత సినిమాల్లో చూసి ఉండటమో జరిగి ఉంటుంది. కానీ నిజంగానే మంచు మనిషి ఉన్నాడని.. చెబుతూ.. అందుకు సంబంధించిన పాదముద్రల ఫొటోలు తీశారు మన సైనిక సిబ్బంది. హిమాలయ పర్వత శ్రేణుల్లో భారీ ఖాయంతో ఉండి ‘యతి’గా పిలుచుకునే మంచుమనిషి ఉన్నాడని చెబుతూ.. భారత సైనికుల బృందం ఫోటోలు విడుదల చేసింది. యతి కూడా సంప్రదాయ నేపాల్ జానపద కథకు చెందినది.. ఇది ఒక అంతుచిక్కని […]

అదిగో యతి.. పాదముద్రలు.. నిజమేనా..?
Follow us on

నిజంగానే మంచు మనిషి ఉన్నాడా..! ఇలాంటివి పురాణాల్లో వినడమో లేక పాత సినిమాల్లో చూసి ఉండటమో జరిగి ఉంటుంది. కానీ నిజంగానే మంచు మనిషి ఉన్నాడని.. చెబుతూ.. అందుకు సంబంధించిన పాదముద్రల ఫొటోలు తీశారు మన సైనిక సిబ్బంది.

హిమాలయ పర్వత శ్రేణుల్లో భారీ ఖాయంతో ఉండి ‘యతి’గా పిలుచుకునే మంచుమనిషి ఉన్నాడని చెబుతూ.. భారత సైనికుల బృందం ఫోటోలు విడుదల చేసింది. యతి కూడా సంప్రదాయ నేపాల్ జానపద కథకు చెందినది.. ఇది ఒక అంతుచిక్కని జీవి. ఇదివరకు చాలా మంది తాము దీన్ని చూసినట్లు పేర్కొన్నారు కానీ.. దానికి సరైన రుజువులు లేవు. సాధారణంగా మంచుమనిషి లేదా తెల్ల ఎలుగు బంటి అని కూడా కొంతమంది అంటారు.

కాగా.. హిమాలయ మంచుకొండల్లో సాహస యాత్రకు వెళ్లిన భారత సైనికుల బృందానికి మంచు మనిషి పాద ముద్రలు కనిపించడంతో వారు వాటిని ఫొటోలు తీశారు. దాదాపు 32 అంగుళాల పొడవు, 15 అంగుళాల వెడల్పుతో ఈ పాదముద్రలు ఉన్నాయని.. ఆర్మీ సాహస బృందం ట్విట్టర్‌లో ఫొటోలను షేర్ చేస్తూ వెల్లడించారు. దీంతో.. ఈ ఫొటోలు కాస్తా వైరల్‌గా మారాయి. అయితే.. గతంలో తాము వెళ్లినప్పుడు కూడా అటువంటివి చూశామని.. కొంతమంది పర్వతారోహకులు పేర్కొంటున్నారు. అప్పుడు అంత టెక్నాలజీ లేక ఫొటోలు తీయలేకపోయామని కామెంట్స్ చేస్తున్నారు.