ఎగ్జిట్ పోల్స్‌తో సంబరాల్లో వైసీపీ నేతలు..

| Edited By:

May 22, 2019 | 11:47 AM

ఎన్నికల ఫలితాలకు ముందే గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో వైసీపీ శ్రేణులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఎగ్జిట్ పోల్స్ వైసీపీ వైపే మొగ్గు చూపడంతో ఆ పార్టీ మహిళా నేతలు ఫుల్ జోష్‌లో ఉన్నారు. వైసీపీ మహిళా నేతలు డ్యాన్స్‌లు వేస్తూ హంగామా చేశారు. దీంతో.. సత్తెనపల్లి వైసీపీ కార్యాలయంలో సందడి వాతావరణం నెలకొంది. సత్తెనపల్లి నుంచి టీడీపీ సీనియర్ నేత, స్పీకర్ కోడెల శివప్రసాద్ పోటీ చేశారు. ఆయనకు ప్రత్యర్థిగా వైసీపీ నేత అంబటి రాంబాబు బరిలో […]

ఎగ్జిట్ పోల్స్‌తో సంబరాల్లో వైసీపీ నేతలు..
Follow us on

ఎన్నికల ఫలితాలకు ముందే గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో వైసీపీ శ్రేణులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఎగ్జిట్ పోల్స్ వైసీపీ వైపే మొగ్గు చూపడంతో ఆ పార్టీ మహిళా నేతలు ఫుల్ జోష్‌లో ఉన్నారు. వైసీపీ మహిళా నేతలు డ్యాన్స్‌లు వేస్తూ హంగామా చేశారు. దీంతో.. సత్తెనపల్లి వైసీపీ కార్యాలయంలో సందడి వాతావరణం నెలకొంది.

సత్తెనపల్లి నుంచి టీడీపీ సీనియర్ నేత, స్పీకర్ కోడెల శివప్రసాద్ పోటీ చేశారు. ఆయనకు ప్రత్యర్థిగా వైసీపీ నేత అంబటి రాంబాబు బరిలో ఉన్నారు. ఈ సారి సత్తెనపల్లిలో అంబటి రాంబాబు గెలుపు ఖాయమని ఆ నియోజక వర్గ వైసీపీ శ్రేణులు ధీమాగా ఉన్నాయి. అందుకే ఒక రోజు ముందే సంబరాలు చేసుకుంటున్నారు నేతలు.