యాదాద్రి కలెక్టరేట్ లో కరోనా కలకలం..!

యాదాద్రి జిల్లా కలెక్టరేట్ లో విధులు నిర్వర్తిస్తున్న ఓ ఉన్నతాధికారికి కరోనా వైరస్

యాదాద్రి కలెక్టరేట్ లో కరోనా కలకలం..!

Updated on: Jun 11, 2020 | 4:03 PM

రాష్ట్రంలో కరోనా కలవరం కొనసాగుతోంది. జీహెచ్ఎంసీ వరకే పరిమితమైన కొవిడ్.. మెల్లమెల్లగా జిల్లాలకు పాకుతోంది. తాజాగా యాదాద్రి జిల్లాలో కరోనా కలకలం సృష్టించింది. జిల్లా కలెక్టరేట్ లో విధులు నిర్వర్తిస్తున్న ఓ ఉన్నతాధికారికి కరోనా వైరస్ సోకింది. అతనితో పాటు ఆయన భార్యకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. దీంతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆందోళనకర వాతావరణం ఏర్పడింది. కరోనా పాజిటివ్ గా తేలిన వారి ఇరువురిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి అతడితో ప్రైమరీ కాంటాక్ట్ కలిగిన వారిని గుర్తించే పనిలోపడ్డారు అధికారులు. అయితే ఈ నెల 5వ తేదీన కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ తో సహా సదరు అధికారి పాల్గొన్నారు. దీంతో జిల్లా అధికారుల్లో టెన్షన్ నెలకొంది.

Loading...
Unable to load recommendations.
Follow Us