World’s oldest man: 112 ఏళ్ల వృద్ధుడి ఆరోగ్య రహస్యం.. ఏంటంటే..!

| Edited By: Pardhasaradhi Peri

Feb 15, 2020 | 3:24 PM

World’s oldest man: ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ వయస్సు కలిగిన వ్యక్తిగా జపాన్‌కు చెందిన చిటెట్సు వటనాబె ప్రపంచ రికార్డుకెక్కారు. చిటెట్సు వటనాబె 112 ఏళ్ల 344 రోజులు వయస్సుతో ప్రపంచంలో అత్యంత వృద్ధుడిగా (పురుషుల్లో) గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డులకెక్కాడు. గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డు ప్రతినిధుల వివరాల ప్రకారం చిటెట్సు వటనాబె 1907లో ఉత్తర జపాన్‌లోని నీగటాలో జన్మించాడు. బుధవారం నీగోటాలోని ఓ నర్సింగ్‌ హోమ్‌లో చిటెట్సుకి గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డు ప్రతినిధులు సర్టిఫికెట్‌ను అందజేశారు. చిటెట్సు […]

World’s oldest man: 112 ఏళ్ల వృద్ధుడి ఆరోగ్య రహస్యం.. ఏంటంటే..!
Follow us on

World’s oldest man: ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ వయస్సు కలిగిన వ్యక్తిగా జపాన్‌కు చెందిన చిటెట్సు వటనాబె ప్రపంచ రికార్డుకెక్కారు. చిటెట్సు వటనాబె 112 ఏళ్ల 344 రోజులు వయస్సుతో ప్రపంచంలో అత్యంత వృద్ధుడిగా (పురుషుల్లో) గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డులకెక్కాడు. గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డు ప్రతినిధుల వివరాల ప్రకారం చిటెట్సు వటనాబె 1907లో ఉత్తర జపాన్‌లోని నీగటాలో జన్మించాడు. బుధవారం నీగోటాలోని ఓ నర్సింగ్‌ హోమ్‌లో చిటెట్సుకి గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డు ప్రతినిధులు సర్టిఫికెట్‌ను అందజేశారు. చిటెట్సు వటనాబె 112 ఏళ్ల వయస్సులో కూడా ఎంతో ఉత్సాహంతో కనిపిస్తోన్న ఫొటో సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది.

చిటెట్సు వటనాబె తన దీర్ఘాయువు యొక్క రహస్యం “కోపం తెచ్చుకోకుండా ముఖం మీద చిరునవ్వు ఉంచడం” అని చెప్పారు. అగ్రికల్చర్‌ స్కూల్‌ నుంచి గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన వటనాబె, ఆ తర్వాత తైవాన్‌లోని దాయ్‌-నిప్పన్‌ మెయిజి షుగర్‌ కంపెనీలో కాంట్రాక్టు పనుల్లో చేరాడు. గత 18 ఏళ్లుగా తైవాన్‌లో నివసిస్తున్నాడు. ఆయనకు ఐదుగురు సంతానమని గిన్నీస్‌ ప్రతినిధులు తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడిగా రికార్డులకెక్కిన మసాజొ నొనాక గత నెలలో చనిపోవడంతో..తాజాగా ఆయన రికార్డును చిటెట్సు వటనాబె అధిగమించాడు. ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు కానె టనాకా (117) కూడా జపనీసే కావడం విశేషం. వీరంతా జపనీయులే కావడం విశేషంగా చెప్పవచ్చు.