జీతం డబ్బులు తగ్గిస్తానందుకు యాజమాని దారుణహత్య

కరోనా ప్రభావంతో బేరం లేదని జీతం డబ్బులు తక్కువ ఇస్తా అన్నందుకు యాజమానిని అతి దారుణంగా హతమార్చాడు ఓ కిరాతకుడు. గొంతు కోసి, శవాన్ని బావిలో పడేసి పరారయ్యాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

జీతం డబ్బులు తగ్గిస్తానందుకు యాజమాని దారుణహత్య

Edited By:

Updated on: Aug 26, 2020 | 4:33 PM

కరోనా ప్రభావంతో బేరం లేదని జీతం డబ్బులు తక్కువ ఇస్తా అన్నందుకు యాజమానిని అతి దారుణంగా హతమార్చాడు ఓ కిరాతకుడు. గొంతు కోసి, శవాన్ని బావిలో పడేసి పరారయ్యాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన తస్లీమ్‌ (21), యజమాని ఓంప్రకాశ్‌ (45) డెయిరీ ఫామ్‌లో రూ.15 వేల జీతానికి పనిచేస్తున్నాడు. అయితే, కరోనా దెబ్బకు నష్టపోయానని, ఈనెల తక్కువ జీతం తీసుకోవాల్సిందిగా తస్లీమ్‌ను యజమాని కోరాడు. అందుకు అంగీకరించకపోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఓంప్రకాశ్‌ ఆగ్రహంతో నౌకరుపై చేయిచేసుకున్నాడు. ఇది మనసు మీదకు తెచ్చుకున్న తస్లీమ్.. యజమానిపై కోపం పెంచుకున్నాడు.

అయితే, ఇదే క్రమంలో రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న ఓం ప్రకాశ్‌ తలపై కర్రతో దాడి చేశాడు తస్లీమ్. అనంతరం గొంతు కోసి హత్య చేశాడు. మృతదేహాన్ని సమీపంలోని బావిలో పడేసి పారిపోయాడు. తర్వాతి రోజు యజమాని బంధువులకు ఫోన్‌ చేసి వ్యాపార పనిపై తాను ఇతర ప్రాంతాలకు వెళ్తున్నట్లు తస్లీమ్ తెలిపాడు.

అయితే, ఓం ప్రకాశ్‌ రెండు రోజులుగా కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన అతడి మేనల్లుడు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు డెయిరీ ఫాం వద్ద పరిశీలిస్తుండగా అక్కడి బావిలో నుంచి దుర్వాసన రావడం గమనించారు. వెళ్లి చూడగా బాధితుడి మృతదేహం బావిలో తేలుతూ కనిపించింది. దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు మృతుడి బైక్, సెల్‌ఫోన్‌ను తస్లీమ్‌ ఎత్తుకెళ్లినట్లుగా గుర్తించారు. యూపీతోపాటు హరియానాలోని పలు ప్రాంతాల్లో గాలించినా నిందితుడి ఆచూకీ లభించలేదు. చివరికి దిల్లీలోని ఝరోడా ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. తస్లీమ్ పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.