బిడ్డలకు డైపర్లు కూడా కొనలేకపోతున్నా..ఓ తల్లి ఆవేదన

కరోనావైరస్ భయాల వల్ల డైపర్ల ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. దీనిపై  ఓ మహిళ ఏడుస్తూ పెట్టిన టిక్‌టాక్ వీడియో ఇంటర్నెట్‌లో ఇప్పుడు ట్రెండింగ్‌లోకి వెళ్లింది. ఒకేసారి 20 రెట్లు ఎక్కువ ధర పెట్టి నా బిడ్డలకు డైపర్లు కొని నా బిడ్డలకు ఎలా వేయగలనని ఆమె వీడియోలో ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె వీడియోపై స్పందించిన లారెన్ విట్నీ అనే మరో మహిళ ప్రస్తుతం ఉన్న భయాందోళనలు గురించి సదరు వీడియో ముఖ్యమైన విషయాన్ని […]

  • Ram Naramaneni
  • Publish Date - 8:27 pm, Thu, 19 March 20
బిడ్డలకు డైపర్లు కూడా కొనలేకపోతున్నా..ఓ తల్లి ఆవేదన

కరోనావైరస్ భయాల వల్ల డైపర్ల ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. దీనిపై  ఓ మహిళ ఏడుస్తూ పెట్టిన టిక్‌టాక్ వీడియో ఇంటర్నెట్‌లో ఇప్పుడు ట్రెండింగ్‌లోకి వెళ్లింది. ఒకేసారి 20 రెట్లు ఎక్కువ ధర పెట్టి నా బిడ్డలకు డైపర్లు కొని నా బిడ్డలకు ఎలా వేయగలనని ఆమె వీడియోలో ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె వీడియోపై స్పందించిన లారెన్ విట్నీ అనే మరో మహిళ ప్రస్తుతం ఉన్న భయాందోళనలు గురించి సదరు వీడియో ముఖ్యమైన విషయాన్ని లేవనెత్తిందని చెప్పుకొచ్చారు. నిత్యావసరాల కొరత ఏర్పడటంతో,  చిల్లర వ్యాపారులు భారీగా ధరలను పెంచుతున్నారని పేర్కొన్నారు.

“నేను మొదట డ్రాప్ట్స్‌లో ఉంచడానికి ఈ వీడియో తీసుకున్నాను. కానీ అనుకోకుండా అప్‌లోడ్ అయిపోయింది. ఒక గంట తర్వాత లాగిన్ అయి చూస్తే..అది అప్పటికే వైరల్‌గా మారింది. ఆ తర్వాత దాన్ని తీసివేయాలనుకున్నా, పరిస్థితి ప్రజలకు తెలియజెప్పాలనే ఉద్దేశ్యంతో ఉంచాలని నిర్ణయించుకున్న” అని  వీడియో పోస్ట్ చేసిన  విట్నీ అనే మహిళ చెప్పుకొచ్చారు.

 ప్రపంచంలోని నగరాల్లో కరోనావైరస్ భయాందోళనలుసంక్షోభానికి కారణమయ్యాయి. ఆస్ట్రేలియాలో అతిపెద్ద సూపర్ మార్కెట్ టాయిలెట్ పేపర్ కొనుగోలుపై పరిమితిని విధించింది.  చిల్లర వ్యాపారులు కూడా మాస్క్‌లు, హ్యాండ్ శానిటైజర్ల కొరతను ఎదుర్కొంటున్నారు.