ఆర్టీసీ మహిళా కండక్టర్‌ ఆత్మహత్య..సమ్మే కారణమా..?

|

Oct 28, 2019 | 7:33 PM

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో మరో కార్మికురాలు ఆత్మహత్య చేసుకున్నారు. ఖమ్మంలో ఆర్టీసీ మహిళా కండక్టర్‌ నీరజ(31) ఇంట్లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. నీరజకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెద్ద అమ్మాయు పూజిత 4 తరగతి, అబ్బాయి విశాల్ 2 వ తరగతి చదువుతున్నారు.  సత్తుపల్లి డిపోలో ఆమె పనిచేస్తున్నారు. సమ్మె నేపథ్యంలో తీవ్ర మనోవేదనకు గురై ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. దీపావళి సందర్భంగా నీరజ నిన్న ఆమె తన తల్లిగారి ఊరైన పల్లెగూడెం వెళ్లారు. […]

ఆర్టీసీ మహిళా కండక్టర్‌ ఆత్మహత్య..సమ్మే కారణమా..?
Follow us on

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో మరో కార్మికురాలు ఆత్మహత్య చేసుకున్నారు. ఖమ్మంలో ఆర్టీసీ మహిళా కండక్టర్‌ నీరజ(31) ఇంట్లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. నీరజకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెద్ద అమ్మాయు పూజిత 4 తరగతి, అబ్బాయి విశాల్ 2 వ తరగతి చదువుతున్నారు.  సత్తుపల్లి డిపోలో ఆమె పనిచేస్తున్నారు. సమ్మె నేపథ్యంలో తీవ్ర మనోవేదనకు గురై ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు.

దీపావళి సందర్భంగా నీరజ నిన్న ఆమె తన తల్లిగారి ఊరైన పల్లెగూడెం వెళ్లారు. ఇవాళ జిల్లావ్యాప్తంగా చేపట్టనున్న ఆర్టీసీ కార్మికుల ధర్నాలో పాల్గొనాల్సి ఉందని చెప్పి ఆమె  ఖమ్మంలోని ఇంటికి చేరుకున్నారు. కుటుంబసభ్యులు ఇంట్లో లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. కండక్టర్‌ ఆత్మహత్య వార్త తెలుసుకొని పెద్దసంఖ్యలో కార్మిక సంఘాల నేతలు ఆమె ఇంటికి చేరుకుంటున్నారు. ఆర్టీసీ మహిళా కండక్టర్‌ ఆత్మహత్యకు పాల్పడటంతో సత్తుపల్లిలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. సత్తుపల్లి డిపో వద్ద కార్మికులు, అఖిల పక్షనాయకులు ఆందోళన చేపట్టారు. వాహనాలను అడ్డుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.