శ్రామిక్ రైల్లో గర్బిణి ప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం

|

Jun 06, 2020 | 2:58 PM

హైదరాబాద్ నుంచి ఒడిశాలోని బాలాంగిర్‌కు ప్రత్యేక శ్రామిక్ రైలులో వెళ్తున్న నిండు గర్బిణి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.

శ్రామిక్ రైల్లో గర్బిణి ప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం
Follow us on

లాక్ డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా ఎక్కిడి వారు అక్కడే చిక్కిపోయారు. ఉపాధి కోల్పోయి వలసకార్మికులు స్వస్థలాలకు చేరుకుంటున్నారు. వీరికోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రామిక్ రైళ్లను నడుపుతోంది. అయితే హైదరాబాద్ నుంచి ఒడిశాలోని బాలాంగిర్‌కు ప్రత్యేక రైలులో నిండు గర్బిణి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఒడిశాకు చెందిన మీనా కుంభర్‌ అనే మహిళ తన కుటుంబసభ్యులతో కలిసి.. తెలంగాణలోని లింగంపల్లి నుంచి ఒడిశాలోని బాలాంగిర్‌కు ప్రత్యేక రైలులో వెళ్తోంది. అయితే మార్గమధ్యలో మీనా కుంభర్‌ నొప్పులు రావడంతో కుటుంబసభ్యుల సాయంతో ప్రసవం అయ్యింది. రైలు టిట్లాగఢ్‌ స్టేషన్‌కి రాగానే రైల్వే వైద్య సిబ్బంది తల్లీబిడ్డలను పరీక్షించి ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. అనంతరం తల్లీబిడ్డలను ఏడీఎంవో సూచనలతో జనని అంబులెన్స్‌ ద్వారా జిల్లా సబ్‌ డివిజనల్‌ ఆస్పత్రికి తరలించారు. ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే పరిధిలోని శ్రామిక స్పెషల్‌ ట్రైన్ లో ఇప్పటివరకు ముగ్గురు చిన్నారులు జన్మించారు.