‘ పులుల రాజ్యం ‘ మనది.. ‘ భయం ‘ లేదంటున్న మోదీ

|

Jul 29, 2019 | 12:41 PM

ఇండియాలో సుమారు 3 వేల పులులు ఉన్నాయని, ప్రపంచంలోనే మనదేశం వాటికి సురక్షితమైన ‘ స్వర్గధామం ‘ వంటిదని అన్నారు ప్రధాని మోదీ. సోమవారం ఢిల్లీలో ఆలిండియా టైగర్ ఎస్టిమేషన్ రిపోర్ట్-2018 ని విడుదల చేసిన సందర్భంగా ఆయన… మన దేశంలో పులుల సంఖ్య గతంలో కన్నా పెరిగిందని తెలిపారు. 2014 లో 14,000 పులులు ఉండగా.. 2018 నాటికి ఈ సంఖ్య 2,967 కు చేరిందని ఆయన చెప్పారు. టైగర్ సెన్సస్ రిపోర్ట్ ప్రకారం.. ఈ […]

 పులుల రాజ్యం  మనది..  భయం  లేదంటున్న మోదీ
Follow us on

ఇండియాలో సుమారు 3 వేల పులులు ఉన్నాయని, ప్రపంచంలోనే మనదేశం వాటికి సురక్షితమైన ‘ స్వర్గధామం ‘ వంటిదని అన్నారు ప్రధాని మోదీ. సోమవారం ఢిల్లీలో ఆలిండియా టైగర్ ఎస్టిమేషన్ రిపోర్ట్-2018 ని విడుదల చేసిన సందర్భంగా ఆయన… మన దేశంలో పులుల సంఖ్య గతంలో కన్నా పెరిగిందని తెలిపారు. 2014 లో 14,000 పులులు ఉండగా.. 2018 నాటికి ఈ సంఖ్య 2,967 కు చేరిందని ఆయన చెప్పారు. టైగర్ సెన్సస్ రిపోర్ట్ ప్రకారం.. ఈ విషయం చెబుతున్నా.. తాజాగా రిలీజైన ఈ సెన్సస్ ప్రతి భారతీయుడు, ప్రతి ప్రకృతి ప్రియుడిని హ్యాపీగా ఉంచుతుంది అని మోదీ వ్యాఖ్యానించారు. ఇదే సందర్భంలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన ‘ ఏక్ థా టైగర్ ‘,
‘ టైగర్ జిందా హై ‘ మూవీల గురించి ప్రస్తావించారు. ఇది ఇక్కడితో ఆగిపోరాదన్నారు. ప్రపంచంలో 2022 కల్లా పులుల సంఖ్య రెట్టింపు కావాలని తొమ్మిదేళ్ల క్రితమే సెయింట్ పీటర్స్ బర్గ్ లో నిర్ణయించారని, కానీ మన దేశం నాలుగేళ్లు ముందుగానే ఈ టార్గెట్ ని పూర్తి చేసిందని మోదీ అన్నారు. ఇంటర్నేషనల్ టైగర్స్ డే ని పురస్కరించుకుని ఆయన.. టైగర్ రిజర్వ్ లపై ఓ నివేదికను, ‘ కౌంటింగ్ టైగర్స్ ‘ పేరిట తీసిన ఒక మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. అభివృధ్ది-పర్యావరణం మధ్య ఆరోగ్యకరమైన బ్యాలన్స్ ఉండాలని ఆయన సూచించారు. పులుల సంరక్షణపై చైతన్యానికి ప్రపంచ వ్యాప్తంగా జులై 29 ని ఇంటర్నేషనల్ టైగర్స్ డే గా పాటిస్తున్నారు.