దుబాయ్‌లో యెల్లో జెర్సీతో తనను చూసినా ఆశ్చర్యం లేదంటున్న రైనా!

|

Sep 02, 2020 | 4:21 PM

ఐపీఎల్‌ ఈ సీజన్‌లోనే తాను మళ్లీ యెల్లో కలర్‌ జెర్సీ ధరించినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నాడు చెన్నై సూపర్‌కింగ్స్‌ ప్లేయర్‌ సురేశ్‌ రైనా. ఆకస్మికంగా దుబాయ్‌ నుంచి వెనక్కి వచ్చేసిన రైనా ఐపీఎల్‌ను వదలిరావడానికి కారణాలేమిటో చెప్పుకొచ్చా

దుబాయ్‌లో యెల్లో జెర్సీతో తనను చూసినా ఆశ్చర్యం లేదంటున్న రైనా!
Follow us on

ఐపీఎల్‌ ఈ సీజన్‌లోనే తాను మళ్లీ యెల్లో కలర్‌ జెర్సీ ధరించినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నాడు చెన్నై సూపర్‌కింగ్స్‌ ప్లేయర్‌ సురేశ్‌ రైనా. ఆకస్మికంగా దుబాయ్‌ నుంచి వెనక్కి వచ్చేసిన రైనా ఐపీఎల్‌ను వదలిరావడానికి కారణాలేమిటో చెప్పుకొచ్చారు. కేవలం కుటుంబం కోసమే వెనక్కి వచ్చేశానన్నాడు. గట్టి కారణం లేకుండా పన్నెండున్నర కోట్ల రూపాయలను ఎవరైనా వదులుకుంటారా అని ప్రశ్నంచాడు రైనా! చెన్నై సూపర్‌కింగ్స్‌ యజమాని శ్రీనివాసన్‌ తనకు తండ్రిలాంటివారని అన్నాడు. ఆయన తనకెప్పుడూ అండగానే నిలిచారన్నాడు. ఆ మాటకొస్తే సీఎస్‌కే కూడా తనకు ఫ్యామిలీవంటిదేనని, మహేంద్రసింగ్‌ ధోనీ తనకెంతో కావలసినవాడని అన్నాడు.. సీఎస్‌కేకు తనకు మధ్య ఎలాంటి వివాదం లేదని వివరించాడు. ఇంటర్నేషనల్ క్రికెట్‌ నుంచి తప్పుకున్నానే తప్ప ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌ నుంచి కాదని, మరో నాలుగైదేళ్లు చెన్నై తరఫున ఈజీగా ఆడగలనని కాన్ఫిడెంట్‌గా చెప్పాడు రైనా! ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నప్పటికీ ప్రాక్టీస్‌ చేస్తూనే ఉన్నానని, మళ్లీ దుబాయ్‌లో తనను చూసినా విస్మయం చెందాల్సిన పని లేదని సురేశ్‌ రైనా అన్నాడు.
ఐపీఎల్‌-2020ని విజయవంతంగా నిర్వహించేందుకు బీసీసీఐ, ఫ్రాంచైజ్‌లు ఎంతగానో శ్రమిస్తున్నాయన్నాడు. క్వారంటైన్‌లో ఆటగాళ్లు గదుల్లోంచి బయటకు రాలేదని రెండు రోజులకోసారి పరీక్షలు చేయించుకున్నామని వివరించాడు సురేశ్‌ రైనా. తన మేనత్త కుటుంబానికి దారుణం జరిగిందని, ఆ ఫ్యామిలీకి అండగా ఉండాల్సిన అవసరం ఏర్పడిందన్నాడు.