ఐదేళ్లలో ఈ బెంగాల్ రాష్టాన్ని సోనార్ (బంగారు) బెంగాల్ లా మారుస్తామని హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఆదివారం బోల్ పూర్ లో జరిగిన రోడ్ షో లో పాల్గొన్న ఆయన, ఈ ర్యాలీకి ఇంతమంది జనం హాజరయ్యారంటే అది ప్రధాని మోదీ పై ఉన్న అభిమానం, గౌరవమే అన్నారు. ఇన్నేళ్ళలో తన సభలకు ఇంతమంది రావడం తను చూడలేదన్నారు. సీఎం మమతా బెనర్జీపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, ఈ సారి కమలం ఇక్కడ వికసిస్తుందని ఆయన చెప్పారు. మమతా బెనర్జీ ! పోరాట మైదానానికి రండి.. తేల్చుకుందాం, ప్రజలు మార్పును కోరుతున్నారు అని అమిత్ షా పేర్కొన్నారు. ప్రధానంగా ఆయన తన ప్రసంగంలో పదేపదే మార్పును గురించి ప్రస్తావించారు. మమత మేనల్లుడు అభిషేక్ ముఖర్జీ దాదాగిరి కి అంతం పలకాలని ఆయన పిలుపునిచ్చారు. ఇక మీకు త్వరలోనే మంచి రోజులు వస్తాయి అని ర్యాలీకి హాజరైన వారిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
West Bengal is yearning for change.
Some glimpses from the ongoing road show in Bolpur. pic.twitter.com/tCVZZRR7Wd
— Amit Shah (@AmitShah) December 20, 2020