విద్యార్థులందరికీ సత్వర న్యాయం: కేటీఆర్

| Edited By:

Apr 22, 2019 | 6:27 PM

ఇంటర్ ఫలితాల నేపథ్యంలో ఏ ఒక్క విద్యార్థికి కూడా నష్టం జరగకుండా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఇంటర్‌ విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ భరోసా కల్పించారు. ఫలితాల విషయంలో ఎలాంటి ఆందోళన చెందవద్దని సూచించారు. ఈ మేరకు ఆదివారం ఒక ట్వీట్‌ చేశారు. ‘పొరపాట్లు జరిగినట్లు భావిస్తే రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోండి. ఫలితాల విషయంలో చోటు చేసుకున్న అపోహలపై విద్యాశాఖ మంత్రి జగదీశ్‌ రెడ్డి ఆదివారం సమీక్షించారు. ముగ్గురు […]

విద్యార్థులందరికీ సత్వర న్యాయం: కేటీఆర్
Follow us on

ఇంటర్ ఫలితాల నేపథ్యంలో ఏ ఒక్క విద్యార్థికి కూడా నష్టం జరగకుండా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఇంటర్‌ విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ భరోసా కల్పించారు. ఫలితాల విషయంలో ఎలాంటి ఆందోళన చెందవద్దని సూచించారు. ఈ మేరకు ఆదివారం ఒక ట్వీట్‌ చేశారు. ‘పొరపాట్లు జరిగినట్లు భావిస్తే రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోండి. ఫలితాల విషయంలో చోటు చేసుకున్న అపోహలపై విద్యాశాఖ మంత్రి జగదీశ్‌ రెడ్డి ఆదివారం సమీక్షించారు. ముగ్గురు ఉన్నతాధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. సత్వరమే దర్యాప్తు జరిపి, మూడు రోజుల్లో కమిటీ నివేదిక సమర్పిస్తుంది.’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు.