wife kills her husband: ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తనే కాదనుకుంది.. ప్రియుడు మోజులో భర్తను చంపిన భార్య..

వాళ్లిద్దరూ గాఢంగా ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. పదమూడేళ్లు అన్యోన్యంగా కాపురంలో చేశారు. వారికి ఓ బాబు కూడా ఉన్నాడు. ఇంతలో పరిచయమైన ఓ వ్యక్తి పచ్చని కాపురంలో చిచ్చుపెట్టాడు. ఏకంగా ఇద్దరు కలిసి భర్త చంపేశారు. ఈ దారుణ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది.

wife kills her husband: ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తనే కాదనుకుంది.. ప్రియుడు మోజులో భర్తను చంపిన భార్య..
Follow us
Balaraju Goud

|

Updated on: Dec 04, 2020 | 7:41 AM

వాళ్లిద్దరూ గాఢంగా ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. పదమూడేళ్లు అన్యోన్యంగా కాపురంలో చేశారు. వారికి ఓ బాబు కూడా ఉన్నాడు. ఇంతలో పరిచయమైన ఓ వ్యక్తి పచ్చని కాపురంలో చిచ్చుపెట్టాడు. ఏకంగా ఇద్దరు కలిసి భర్త చంపేశారు. ఈ దారుణ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది.

ప్రియుడు మోజులో పడి భార్య కట్టుకున్న భర్తను కాటికి పంపింది. కర్ణాటక రాష్ట్రంలోని మండ్య తాలూకాలోని హనకెరెలో జరిగిన ఈ ఘోరం ఆలస్యంగా వెలుగు చూసింది. మండ్య గ్రామానికి చెందిన ప్రదీప్‌ (35), భార్య శిల్ప (30) 13 ఏళ్ల కిందట ప్రేమించుకుని పెళ్లాడారు. వారికి 12 ఏళ్ల కొడుకు ఉన్నాడు. దంపతుల కాపురం అన్యోన్యంగా సాగిపోతుంది. ఇంతలో మూడేళ్ల కిందట కేఆర్‌ నగరానికి చెందిన మధు నాయక్‌ (34) అనే వ్యక్తి శిల్పకు పరిచయమయ్యాడు. స్వయం సేవా సంఘాల వారికి రుణాలను ఇప్పించే పనులు చేసేవాడు. శిల్ప, మధుల పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. శిల్ప భర్త ఇంట్లో లేని సమయంలో నేరుగా ఇంటికి రాకపోకలు సాగించడం మొదలుపెట్టాడు. ఇది తెలిసి ప్రదీప్‌ భార్యను తీవ్రంగా మందలించగా ఎన్నోసార్లు ఘర్షణలకు దారితీశాయి.

తమ ఆనందానికి అడ్డుగా ఉన్న భర్తను తప్పించాలనుకున్న అక్రమ ప్రేమజంట పక్కాగా స్కెచ్ వేశారు. నవంబర్‌ 18వ తేదీన రాత్రి భార్య శిల్ప గుట్టుగా భోజనంలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చింది. దీంతో మత్తులోకి జారుకున్న భర్తను ప్రియునితో కలిసి గొంతు నులిమి చంపింది. తెల్లవారుజామున గుండెపోటుతో చనిపోయాడని శిల్ప ఇరుగు పొరుగు వారిని నమ్మించింది. ఎవరికి అనుమానం రాకుండా త్వరత్వరగా అంత్యక్రియలు జరిపించింది. అప్పటినుంచి ప్రియుడు మధుతో జల్సాలు చేస్తుండడం చూసి ప్రదీప్‌ బంధువులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ జరిపిన పోలీసులు అసలు భాగోతాన్ని రాబట్టారు. శిల్ప,మధులను అదుపులోకి తీసుకుని తమ స్టైల్‌లో ఎంక్వేరీ చేయడంతో ప్రదీప్‌ను తామే హత్య చేశామని ఒప్పుకున్నారు. దీంతో ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు జిల్లా జైలుకు తరలించారు.