చైనా అంటే భయమెందుకు ? ప్రభుత్వంపై కాంగ్రెస్ ఫైర్

| Edited By: Pardhasaradhi Peri

Aug 15, 2020 | 4:13 PM

భారత భూభాగంలోకి అక్రమంగా చొరబడిన చైనా అంటే అధికారంలో ఉన్నవారు (ప్రధాని మోదీ) ఎందుకు భయపడుతున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్

చైనా అంటే భయమెందుకు ? ప్రభుత్వంపై కాంగ్రెస్ ఫైర్
Follow us on

భారత భూభాగంలోకి అక్రమంగా చొరబడిన చైనా అంటే అధికారంలో ఉన్నవారు (ప్రధాని మోదీ) ఎందుకు భయపడుతున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా ప్రశ్నించారు. దేశ ప్రజలను ఉద్దేశించి మోదీ చేసిన ప్రసంగాన్ని ఆయన గుర్తు చేస్తూ..చైనాను వెనక్కి పారదోలి ఈ దేశాన్ని రక్షించేందుకు ప్రభుత్వం ఏం చేస్తోందని ఈ  స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భారతీయులంతా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని కోరారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, ఈ దేశ 130 కోట్ల మంది ప్రజలు మన సాయుధ దళాలను చూసి గర్విస్తున్నారని, వారి పట్ల ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని  ఆయన చెప్పారు. ప్రజాస్వామ్యమంటే ఈ సర్కార్ కి నమ్మకం ఉందా, ప్రజా అభిప్రాయాలకు ఈ ప్రభుత్వం విలువనిస్తుందా, మాట్లాడడానికి గానీ, ప్రయాణించడానికి గానీ మనకు స్వేఛ్చ ఉందా అని ప్రశ్నించిన సూర్జేవాలా.. అసలు మనం ఏ దుస్తులు ధరించాలో ఆ విషయంలోనైనా మనకు ఫ్రీడమ్ ఉందా అని ఆవేశంగా వ్యాఖ్యానించారు.