కరోనా కేసులు పెరుగుతున్నాయి జాగ్రత్త..! : డబ్ల్యూహెచ్ఓ

|

Jun 06, 2020 | 4:04 PM

జన సాంద్రత అధికంగా ఉన్న దక్షిణాసియా దేశాల్లో కరోనా మహమ్మారి విస్తరణకు ఎక్కువ అవకాశాలున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెల్త్ ఎమర్జెన్సీ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైఖేల్ రియాన్ హెచ్చరిక.

కరోనా కేసులు పెరుగుతున్నాయి జాగ్రత్త..! : డబ్ల్యూహెచ్ఓ
Follow us on

జన సాంద్రత అధికంగా ఉన్న దక్షిణాసియా దేశాల్లో కరోనా మహమ్మారి విస్తరణకు ఎక్కువ అవకాశాలున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెల్త్ ఎమర్జెన్సీ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైఖేల్ రియాన్ హెచ్చరించారు. కోవిడ్-19 మహమ్మారి బారినపడే వారి సంఖ్య భారత్ లో పెరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. లాక్ డౌన్ కారణంగా కరోనా కట్టడి సమర్థవంతంగా చేయగలిగారన్న ఆయన.. ఇకపై జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గడిచిన మూడు వారాల్లోనే కేసుల సంఖ్య రెట్టింపు కావడం కొంత నష్ట భయాన్ని సూచిస్తోందన్నారు. భారత దేశంలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో దీని ప్రభావం వేర్వేరుగా కనిపిస్తోందన్న మైఖల్.. ప్రతి ఒక్కరూ జాగ్రత్త పాటించడం ద్వారా కరోనాను నియంత్రించవచ్చన్నారు.