జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రెండు రోజుల ఢిల్లీ పర్యటనను ముగించుకుని శనివారం సాయంత్రం తిరుగు ప్రయాణమయ్యారు. ఆయన హస్తిన పర్యటన రాజకీయంగా ప్రాముఖ్యతను సంతరించుకున్నప్పటికీ అసలు ఉద్దేశం ఏంటనేది తెలియలేదు. కొద్దిరోజులుగా వైసీపీ అనుసరిస్తున్న విధివిధానాలను కమలం పెద్దలకు వివరించడానికి, ప్రధాని మోదీని కలవడానికి వెళ్లారని వార్తలు వచ్చాయి. అయితే జనసేన పార్టీ మాత్రం దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. అంతేకాకుండా హస్తినలో పవన్ ఎక్కడ ఉన్నారు..? ఎవర్ని కలిశారు.? లేదా వ్యక్తిగత పని మీద వెళ్ళారా.? అనేది కూడా పూర్తి గోప్యతగా ఉంచారు. కాగా, ఈ ఢిల్లీ పర్యటనపై పవన్ కళ్యాణ్ రేపు అనగా ఆదివారం ప్రెస్ మీట్ పెట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.