రాహుల్ గాంధీపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు అఖిల భారత హిందూ మహాసభ అధ్యక్షుడు స్వామి చక్రపాణి. రాహుల్ హోమో సెక్స్‌వల్ అని విన్నామంటూ బాంబ్ పేల్చారు. దీంతో ఒక్కసారిగా వివాదం రాజుకుంది. సావర్కర్‌కు, మహాత్మాగాంధీ హంతకుడైన గాడ్సేకూ శారీరక సంబంధం ఉందంటూ 10 రోజుల పాటు జరిగిన కాంగ్రెస్ సేవాదళ్ క్యాంప్‌లో బుక్‌లెట్ పంచిపెట్టారని రూమర్స్ వినిపిస్తున్నాయి. దీంతో కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు స్మామి చక్రపాణి. “ఇవి సావర్కర్ జీపై హాస్యాస్పదమైన ఆరోపణలు. అదేవిధంగా, రాహుల్ గాంధీ స్వలింగ సంపర్కుడని కూడా మేము విన్నాము” అని చక్రపాణి ఏఎన్‌ఐ సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
కాంగ్రెస్ కూడా ఈ విషయంపై దీటుగానే కౌంటరిచ్చింది. సాక్ష్యాల ఆధారంగా రచయిత బుక్‌లెట్ రాశారని కాంగ్రెస్ సేవాదళ్ చీఫ్ లాల్జీ దేశాయ్ చెప్పుకొచ్చారు. లారీ కాలిన్స్, డొమినిక్ లాపియెర్ రాసిన ‘ఫ్రీడమ్ ఎట్ మిడ్నైట్’ పుస్తకంలోని 423 వ పేజీలోని సారాంశాన్ని ఉటంకిస్తూనే ‘వీర్ సావర్కర్ కిట్నే వీర్?’ అనే బుక్‌లెట్ ప్రచురించారని వెల్లడించారు. మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలపై అత్యాచారాలకు సావర్కర్ తన అనుచరులను ప్రోత్సహించాడని, 12 ఏళ్ల వయసులో ఆయన మసీదులపై రాళ్ళు రువ్వారని కూడా ఈ బుక్‌లెట్ పేర్కొంది.