సమన్లు జారీ చేస్తారా ? భయపడబోం, ఎవరికీ తలవంచం, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ

| Edited By: Pardhasaradhi Peri

Feb 21, 2021 | 6:30 PM

బొగ్గు కేసులో తన భార్య రుజిరా నమూలాకు సీబీఐ సమన్లు జారీ చేయడంపై ఆమె భర్త, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ మండిపడ్డారు. ఈ మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో..

సమన్లు జారీ చేస్తారా ? భయపడబోం, ఎవరికీ తలవంచం, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ
Follow us on

బొగ్గు కేసులో తన భార్య రుజిరా నమూలాకు సీబీఐ సమన్లు జారీ చేయడంపై ఆమె భర్త, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ మండిపడ్డారు. ఈ మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో సీబీఐ బృందం తమ ఇంటికి వచ్చి తన భార్య పేరిట నోటీసులిచ్చిందని, కానీ చట్టం పట్ల తమకు పూర్తి నమ్మకం ఉందని ఆయన ట్వీట్ చేశారు. ఈ విధమైన చర్యల ద్వారా తమను బెదిరిద్దామని చూస్తే వారు పొరబడినట్టేనని, తాము ఎవరికీ తలవంచబోమని ఆయన అన్నారు. ఇలాంటి ఆటలను సాగనివ్వబోమన్నారు. బొగ్గు స్మగ్లింగ్, చోరీ కేసులో ఈయన భార్యపైన, మరికొందరిపైన సీబీఐ గత నవంబరులో కేసు పెట్టింది.  ఈ దర్యాప్తు బృందానికి చెందిన  ముగ్గురు  సభ్యులు ఆదివారం మధ్యాహ్నం  వీరి ఇంటికి వచ్చి.. నోటీసులు ఇచ్చారు. రుజిరాను వారు ప్రశ్నించవచ్ఛునని వార్తలు వఛ్చినప్పటికీ దీన్ని అధికారికంగా ధ్రువీకరించలేదు. బెంగాల్ లో మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే హోమ్ మంత్రి అమిత్ షా ఈ రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేశారు. సీఎం మమతా బెనర్జీ, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీల అవినీతిపై తీవ్రంగా గళమెత్తారు. అయితే ఇదే సమయంలో బీజేపీని,  అమిత్ షాను మమత, అభిషేక్ తమ ప్రసంగాల్లో దుయ్యబడుతూ వచ్చారు. బయటివారిని ఈ రాష్ట్రంలో అనుమతించే ప్రసక్తి లేదన్నారు.

పైగా బెంగాల్ కి ఈ సొంత కూతురే కావాలి (బెంగాల్ వాంట్స్ ఇట్స్ ఓన్ డాటర్) అనే నినాదాన్ని టీఎంసీ నిన్న తమ ప్రచార అస్త్రంగా పేర్కొంది. అంటే మళ్ళీ మమతా బెనర్జీని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని ఈ స్లోగన్ లో స్పష్టం చేశారు.

Also Read:

పెట్రోల్, డీజిల్‌పై రూ.1 తగ్గింపు.. సంచలన నిర్ణయం తీసుకున్న పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం

EPFO New Enrolments: దేశ వ్యాప్తంగా భారీగా పెరిగిన ఉద్యోగావకాశాలు.. కేవలం డిసెంబరులో కొత్తగా 8.04లక్షల ఉద్యోగాలు