AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: మొబైల్ ఫోన్ దొంగతనం చేసి పరార్.. కానీ విధి వేట నుంచి తప్పించుకోలేకపోయాడు..!

బెంగళూరులో మొబైల్ ఫోన్ లాక్కొని పారిపోవడానికి ప్రయత్నించిన 18 ఏళ్ల యువకుడు అనూహ్యంగా కుప్పకూలి మృతి చెందిన ఘటన సంచలనం రేపింది. మృతుడిని జునైద్‌గా గుర్తించగా, అతనితో కలిసి ఘటనలో పాల్గొన్న అర్బాజ్ (23) అనే యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది.

Watch Video: మొబైల్ ఫోన్ దొంగతనం చేసి పరార్.. కానీ విధి వేట నుంచి తప్పించుకోలేకపోయాడు..!
Mobile Phone Snatching
Balaraju Goud
|

Updated on: Jun 20, 2026 | 3:49 PM

Share

బెంగళూరులో మొబైల్ ఫోన్ లాక్కొని పారిపోవడానికి ప్రయత్నించిన 18 ఏళ్ల యువకుడు అనూహ్యంగా కుప్పకూలి మృతి చెందిన ఘటన సంచలనం రేపింది. మృతుడిని జునైద్‌గా గుర్తించగా, అతనితో కలిసి ఘటనలో పాల్గొన్న అర్బాజ్ (23) అనే యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది.

పోలీసుల వివరాల ప్రకారం, జూన్ 15న సాయంత్రం 5.30 గంటల సమయంలో బెంగళూరులోని కబ్బన్‌పేట్ ప్రాంతంలో జునైద్, అర్బాజ్‌లు ద్విచక్రవాహనంపై వెళ్తూ ఒక పాదచారి మొబైల్ ఫోన్‌ను లాక్కొని వేగంగా పారిపోయేందుకు ప్రయత్నించారు. అయితే బాధితుడు వెంటనే కేకలు వేస్తూ వారిని వెంబడించాడు. ఈ క్రమంలో ఘటనను గమనించిన ఓ కూలీ చాకచక్యంగా స్పందించాడు. పారిపోతున్న స్కూటర్‌పై ఒక సంచిని విసరడంతో వాహనం అదుపుతప్పి కిందపడింది. దీంతో ఇద్దరు నిందితులు రోడ్డుపై పడిపోయారు. వెంటనే వారు స్కూటర్, మొబైల్ ఫోన్‌ను అక్కడే వదిలేసి కాలినడకన పారిపోవడానికి ప్రయత్నించారు.

దాదాపు 250 మీటర్లు పరిగెత్తిన తర్వాత జునైద్ అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. సమీపంలో ఉన్న మోటార్‌సైకిల్ వద్ద పడిపోయిన అతను అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం అర్బాజ్‌ను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో జునైద్‌కు గుండె సంబంధిత సమస్యలు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. అతనికి గతంలో కరోనరీ స్టెంట్ శస్త్రచికిత్స కూడా జరిగినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. ప్రమాదం తర్వాత తీవ్రంగా పరుగెత్తడం, శారీరక ఒత్తిడి కారణంగానే అతను కుప్పకూలి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు మొబైల్ లాక్కోవడం కేసు నమోదు చేయగా, జునైద్ మరణంపై అసహజ మరణంగా మరో కేసు నమోదు చేశారు. ఘటనపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

వైరల్ వీడియో ఇక్కడ క్లిక్ చేయండి..

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us