కేఎఫ్ బీర్లు దొరకట్లా సీఎం సారూ! మా జిల్లాను విలీనం చేయండి

|

Jun 04, 2019 | 3:13 PM

తెలంగాణ ఎంపీటీసీ ఎన్నికల లెక్కింపులో చిత్ర, విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేసిన ఓటర్లు పనిలో పనిగా తమ కోర్కెల చిట్టాలను ఒక చిట్టీలో రాసి బ్యాలెట్ బాక్సుల్లో పడేశారు. కౌంటింగ్ సందర్భంగా అవన్నీ బయటపడ్డాయి. అయితే అందరూ తమ తమ గ్రామంలో స్థానికంగా ఎదుర్కొంటున్న రోడ్లు, త్రాగునీటి సమస్యల, జిల్లా కేంద్రాల ఏర్పాటు వంటి వాటిని రాయగా…ఒక ఓటర్ మాత్రం తనకు కింగ్ ఫిషర్ బీర్లు దొరకడంలేదని సీఎంకు మొరపెట్టుకున్నాడు. జగిత్యాల జిల్లా […]

కేఎఫ్ బీర్లు దొరకట్లా సీఎం సారూ! మా జిల్లాను విలీనం చేయండి
Follow us on

తెలంగాణ ఎంపీటీసీ ఎన్నికల లెక్కింపులో చిత్ర, విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేసిన ఓటర్లు పనిలో పనిగా తమ కోర్కెల చిట్టాలను ఒక చిట్టీలో రాసి బ్యాలెట్ బాక్సుల్లో పడేశారు. కౌంటింగ్ సందర్భంగా అవన్నీ బయటపడ్డాయి. అయితే అందరూ తమ తమ గ్రామంలో స్థానికంగా ఎదుర్కొంటున్న రోడ్లు, త్రాగునీటి సమస్యల, జిల్లా కేంద్రాల ఏర్పాటు వంటి వాటిని రాయగా…ఒక ఓటర్ మాత్రం తనకు కింగ్ ఫిషర్ బీర్లు దొరకడంలేదని సీఎంకు మొరపెట్టుకున్నాడు. జగిత్యాల జిల్లా రాయికల్‌ మండలం మూటపల్లి గ్రామానికి చెందిన బ్యాలెట్‌ బాక్స్‌ను తెరిచిన అధికారులకు జగిత్యాల జిల్లా వాసుల పేరుతో ఈ లేఖ దొరికింది. తమ జిల్లాలో కింగ్‌ఫిషర్‌ బ్రాండ్‌ బీరు దొరకడం లేదని తన లేఖలో ఆవేదన వ్యక్తం చేసిన అజ్ఞాత వ్యక్తి… ఈ బ్రాండ్‌ బీరు కోసం పక్క జిల్లాలకు వెళ్లాల్సి వస్తోందని తన ఆవేదనను వ్యక్తం చేశాడు. తమ మీద దయతలిచి కింగ్‌ఫిషర్‌ బీర్‌ను అందుబాటులో ఉంచాలని కోరాడు. అంతే కాదు.. తన లేఖలో నోట్‌ అంటూ .. కింగ్‌ ఫిషర్‌ బీర్ల కోసం జిగిత్యాల జిల్లాను కరీంనగర్‌లో విలీనం చేయాలనే సూచన చేశాడా వ్యక్తి. ఇప్పుడా లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.