జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయం…ఈ అవకాశం ఎవరికంటే…

|

Nov 24, 2020 | 6:24 PM

కరోనా నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయం కల్పించారు. 80 ఏళ్లు దాటిన ఓటర్లు, దివ్యాంగులు, నవంబర్‌ 1 తర్వాత కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారు పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం...

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయం...ఈ అవకాశం ఎవరికంటే...
Follow us on

కరోనా నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయం కల్పించారు. 80 ఏళ్లు దాటిన ఓటర్లు, దివ్యాంగులు, నవంబర్‌ 1 తర్వాత కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారు పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం www.tsec.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఎన్నికల అధికారి డీఎస్‌ లోకే్‌షకుమార్‌ సూచించారు. పోస్టల్‌ బ్యాలెట్లను వారి చిరునామాలకు పంపిస్తామని చెప్పారు.

పోలింగ్ కేంద్రాల్లో దివ్యాంగులు, వృద్ధుల కోసం ర్యాంపులు, వీల్ చైర్లు అందుబాటులో ఉంచినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. వారికి సాయం చేసేందుకు వాలంటీర్లను కూడా  ఏర్పాటుచేస్తున్నారు.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు డిసెంబర్ 1న పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికలను బ్యాలెట్ ద్వారా నిర్వహిస్తున్నారు. అవసరమైన చోట్ల డిసెంబర్ 3న రీపోలింగ్ నిర్వహించనున్నారు. డిసెంబర్ 4న ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తారు.