వీఐ(వోడాఫోన్ ఐడియా) కొత్త సిమ్ కొనుగోలు చేసే కొత్త కస్టమర్ల కోసం 399 ప్లాన్‌ను విడుదల చేసింది. ఈ ప్లాన్ డిజిటల్ ఎక్స్‌క్లూజివ్, వీఐ వెబ్‌సైట్ ద్వారా మాత్రమే పొందవచ్చు. మొదటిసారి వోడాఫోన్ ఐడియా సిమ్‌ను కొనుగోలు చేసిన ప్రీపెయిడ్ మరియు పోస్ట్‌పెయిడ్ వినియోగదారుల కోసం వీఐ(వొడఫోన్-ఐడియా) కొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ MNP (మొబైల్ నంబర్ పోర్టబిలిటీ) చేసుకున్నవారికి కూడా ఉపయోగపడుతుంది. ఒక వినియోగదారు వెబ్‌సైట్ నుంచి కొత్త సిమ్ కొనుగోలు చేసినప్పుడు రూ. 399 ప్లాన్‌ను ఎంచుకోవచ్చు.
రూ. 399 ప్లాన్‌లో ప్రీపెయిడ్ వినియోగదారులకు రోజుకు 1.5GB డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 SMS లు వస్తాయి. ఈ ప్లాన్ 56 రోజుల వాలిడిటీ ఉంటుంది. అలాగే వీఐ మూవీస్ & టీవీకి యాక్సెస్ వంటి అదనపు ప్రయోజనాలను కూడా పొందవచ్చు. మరోవైపు రూ. 297 ప్రీపెయిడ్ ప్లాన్ కూడా వినియోగదారులకు అందుబాటులో ఉంది. రెంటికీ ఒకే తేడా ఏమిటంటే రూ. 297 ప్లాన్‌కు 28 రోజుల చెల్లుబాటు ఉండగా రూ. 399 ఒకటి 56 రోజుల వరకు ఉంటుంది.