కమల్ హాసన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన వివేక్ ఒబేరాయ్

నటుడు, మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హసన్‌పై బాలీవుడ్ హీరో వివేక్ ఒబేరాయ్ మండి పడ్డారు. స్వతంత్ర భారత దేశంలో తొలి ఉగ్రవాది హిందువు అంటూ కమల్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కమల్ తమిళనాడులోని అరవకురిచ్చిలో ఓ సభలో మాట్లాడుతూ, దేశంలో తొలి ఉగ్రవాది ఓ హిందూ అంటూ గాంధీని చంపిన నాథూరాం గాడ్సే గురించి ప్రస్తావించారు. దీనిపై బీజేపీ నేతలు మండిపడుతుండగా… బాలీవుడ్ నటుడు వివేక్ ఓబెరాయ్ కూడా స్పందించారు. కమల్ సర్ మీరు […]

కమల్ హాసన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన వివేక్ ఒబేరాయ్

Edited By:

Updated on: May 14, 2019 | 7:09 PM

నటుడు, మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హసన్‌పై బాలీవుడ్ హీరో వివేక్ ఒబేరాయ్ మండి పడ్డారు. స్వతంత్ర భారత దేశంలో తొలి ఉగ్రవాది హిందువు అంటూ కమల్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కమల్ తమిళనాడులోని అరవకురిచ్చిలో ఓ సభలో మాట్లాడుతూ, దేశంలో తొలి ఉగ్రవాది ఓ హిందూ అంటూ గాంధీని చంపిన నాథూరాం గాడ్సే గురించి ప్రస్తావించారు. దీనిపై బీజేపీ నేతలు మండిపడుతుండగా… బాలీవుడ్ నటుడు వివేక్ ఓబెరాయ్ కూడా స్పందించారు.

కమల్ సర్ మీరు చాలా గొప్పనటులు, కానీ ముస్లింల ఓట్ల కోసం ఇలా మాట్లాడతారా? అంటూ కమల్ ను నిలదీశారు. “కళకు ఎలా మతం ఉండదో ఉగ్రవాదానికి కూడా మతం ఉండదు సర్, మీరు గాడ్సేని ఉగ్రవాది అంటూనే హిందూ అంటూ మతం గురించి ప్రస్తావన తీసుకువచ్చారు. ఉగ్రవాదం ఎప్పటికీ భారత్‌ను చీల్చలేదని, దేశాన్ని విభజించే వ్యాఖ్యలు ఎవరూ చేయరాదని వివేక్ హితవు పలికారు.

Follow Us