జాతీయ క్రీడా పురస్కారాల కమిటీలో ఎవరెవరు ఉన్నారంటే..

|

Aug 01, 2020 | 3:10 AM

జాతీయ క్రీడా అవార్డుల విజేతలను ఎంపిక చేసే సెలక్షన్‌ కమిటీని శుక్రవారం కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 12 మంది సభ్యుల కూడిన ఈ కమిటీలో భారత మాజీ డాషింగ్‌ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌తో పాటు భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్‌ సర్దార్‌ సింగ్‌, పారాలింపిక్స్‌ రజత పతక విజేత దీపా మలిక్లు స్థానం కల్పించింది.

జాతీయ క్రీడా పురస్కారాల  కమిటీలో ఎవరెవరు ఉన్నారంటే..
Follow us on

జాతీయ క్రీడా అవార్డుల విజేతలను ఎంపిక చేసే సెలక్షన్‌ కమిటీని శుక్రవారం కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 12 మంది సభ్యుల కూడిన ఈ కమిటీలో భారత మాజీ డాషింగ్‌ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌తో పాటు భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్‌ సర్దార్‌ సింగ్‌, పారాలింపిక్స్‌ రజత పతక విజేత దీపా మలిక్లు స్థానం కల్పించింది. సుప్రీంకోర్టు రిటైర్డ్‌ జస్టిస్‌ ముకుందకమ్‌ శర్మ ఈ ప్యానల్‌కు చైర్మన్‌గా వ్యవహరిస్తారని కేంద్ర క్రీడా శాఖ పేర్కొంది. వీరితో పాటు రియో పారాలింపిక్స్‌ రజత పతక విజేత దీపా మలిక్, మాజీ టీటీ ప్లేయర్‌ మోనాలిసా బరువా మెహతా, భారత మాజీ బాక్సర్‌ వెంకటేశన్‌ దేవరాజన్, ‘సాయ్‌’ డైరెక్టర్‌ జనరల్‌ సందీప్‌ ప్రదాన్, సంయుక్త కార్యదర్శి ఎల్‌ఎస్‌ సింగ్, ‘టాప్స్‌’ సీఈవో రాజేశ్‌ రాజగోపాలన్, క్రీడా వ్యాఖ్యాత మనీశ్‌ బతావియా, క్రీడా పాత్రికేయులు అలోక్‌ సిన్హా, నీరూ భాటియా సెలక్షన్‌ కమిటీలో ఇతర సభ్యులుగా ఉన్నారు. క్రీడా రంగంలో ప్రతిభ కనబర్చిన వారినికి ఎంపిక చేసి కేంద్రానికి నివేదిక ఇవ్వనుంది. ఈ నివేదిక అధారంగా ఉత్తమ క్రీడాకారులకు అవార్డులను ప్రకటించనుంది కేంద్రం.