AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వైరల్ కావాలనే పిచ్చి.. సొంత సోదరి గొంతు కోసినట్లు వీడియో.. అసలు నిజం తెలిస్తే షాక్!

సోషల్ మీడియాలో ఫేమస్ కావాలనే కోరికతో కొందరు యువత చేసే ప్రయోగాలు రోజురోజుకూ హద్దులు దాటుతున్నాయి. లైకులు, వ్యూస్, కామెంట్ల కోసం వింతవింత వీడియోలు చేస్తూ నెటిజన్ల దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, ఇతర సోషల్ మీడియా వేదికల్లో వైరల్ కావాలనే తపనతో ప్రమాదకరమైన స్టంట్లు, భయంకరమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

వైరల్ కావాలనే పిచ్చి.. సొంత సోదరి గొంతు కోసినట్లు వీడియో.. అసలు నిజం తెలిస్తే షాక్!
Girls Fake Throat Slitting Scene
Balaraju Goud
|

Updated on: Nov 24, 2026 | 7:44 PM

Share

సోషల్ మీడియాలో ఫేమస్ కావాలనే కోరికతో కొందరు యువత చేసే ప్రయోగాలు రోజురోజుకూ హద్దులు దాటుతున్నాయి. లైకులు, వ్యూస్, కామెంట్ల కోసం వింతవింత వీడియోలు చేస్తూ నెటిజన్ల దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, ఇతర సోషల్ మీడియా వేదికల్లో వైరల్ కావాలనే తపనతో ప్రమాదకరమైన స్టంట్లు, భయంకరమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇందులో ఓ అమ్మాయి తన సొంత సోదరి గొంతు కోసినట్లు కనిపించడం చూసి నెటిజన్లు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

అసలేం జరిగిందంటే?

వైరల్ వీడియోలో ఇద్దరు అమ్మాయిలు కనిపిస్తారు. ఒక అమ్మాయి కుర్చీలో ముందు కూర్చొని ఉండగా, మరో అమ్మాయి ఆమె వెనుక నిలబడి ఉంది. మొదట ఇద్దరూ కెమెరా ముందు సాధారణంగా పోజులిస్తూ కనిపించారు. ఇంతలోనే వెనుక ఉన్న అమ్మాయి అకస్మాత్తుగా ముందున్న అమ్మాయి గొంతు కోసినట్లు నటిస్తుంది. దీంతో ముందు కూర్చున్న అమ్మాయి తన మెడను పట్టుకుని రక్తం కారుతున్నట్లుగా బాధతో విలవిల్లాడిపోయింది. మొదటిసారి వీడియో చూసిన వారికి నిజంగానే ఏదో ఘోరం జరిగిపోయిందేమో అనిపిస్తుంది. అయితే అసలు విషయం తెలిసిన తర్వాత అందరూ ఆశ్చర్యపోతున్నారు.

కత్తి కాదు.. సాస్ పూసిన చెంచా!

నిశితంగా పరిశీలిస్తే ఇది నిజమైన దాడి కాదని, కేవలం సోషల్ మీడియా కోసం రూపొందించిన ఫేక్ వీడియో అని అర్థమవుతుంది. గొంతు కోసినట్లు కనిపించే వస్తువు నిజమైన కత్తి కాదు. దాని వెనుక భాగానికి సాస్ పూసిన చెంచాను ఉపయోగించి ఈ సన్నివేశాన్ని చిత్రీకరించారు. మెడపై కనిపించే రక్తం కూడా నిజమైనది కాదు. సాస్‌ను ఉపయోగించి రక్తం కారుతున్నట్లుగా భ్రమ కలిగించారు.

పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాలంటున్న నెటిజన్లు!

ఈ వీడియోపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కేవలం వ్యూస్, లైకుల కోసం ఇలాంటి భయంకరమైన వీడియోలు చేయడం అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. పిల్లలు చదువుపై దృష్టి పెట్టకుండా రీల్స్ తయారీలో మునిగిపోతున్నారని కొందరు విమర్శిస్తున్నారు. మరికొందరు తల్లిదండ్రులు తమ పిల్లల సోషల్ మీడియా కార్యకలాపాలపై నిఘా ఉంచాలని సూచిస్తున్నారు.

మొత్తానికి వైరల్ కావాలనే ప్రయత్నంలో నిజానికి, నటనకు మధ్య ఉన్న గీతను చెరిపేస్తున్న ఇలాంటి వీడియోలు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా చిన్నారులు సోషల్ మీడియాలో ఎలాంటి కంటెంట్ చూస్తున్నారు? ఎలాంటి విషయాలను అనుకరిస్తున్నారు? అనే అంశంపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.

వైరల్ వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us