విజయవాడ సెంట్రల్ ఏసీపీ సస్పెండ్ : రీజ‌న్ ఏంటంటే ?

|

Aug 30, 2020 | 11:11 AM

విజయవాడ సెంట్రల్‌ ఏసీపీ నాగరాజారెడ్డిపై వేటు ప‌డింది. ఆయ‌న సస్పెండ్ చేస్తూ డీజీపీ గౌతమ్‌ సవాంగ్ ఉత్త‌ర్వులు జారీ చేశారు.

విజయవాడ సెంట్రల్ ఏసీపీ సస్పెండ్ : రీజ‌న్ ఏంటంటే ?
Follow us on

విజయవాడ సెంట్రల్‌ ఏసీపీ నాగరాజారెడ్డిపై వేటు ప‌డింది. ఆయ‌న సస్పెండ్ చేస్తూ డీజీపీ గౌతమ్‌ సవాంగ్ ఉత్త‌ర్వులు జారీ చేశారు. జూలై 24 వ తేదీన పటమటలో నిర్మిస్తున్న భవనంపై నుంచి ప్ర‌మాద‌వ‌శాత్తూ కింద ప‌డి వెంకటేశ్వరరావు అనే కార్మికుడు ప్రాణాలు విడిచాడు. దీనిపై పటమట పీఎస్‌లో కేసు నమోదైంది. ఇందుకు సంబంధించి ఆ బిల్డింగ్ ఓన‌ర్‌ను బెదిరించి… నాగరాజారెడ్డి డ‌బ్బు దండుకున్నార‌నే ఆరోపణలు వచ్చాయి. దీనిపై డీజీపీకి కంప్లైంట్ అందడంతో ఆయన విజయవాడ సీపీని విచారణ చేయాల్సిందిగా ఆదేశించారు. పూర్తిస్థాయిలో దర్యాప్తు అనంత‌రం సీపీ శ్రీనివాసులు ఫైన‌ల్ రిపోర్ట్‌ను డీజీపీకి నివేదించగా…..అతడిని సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

ఈ క్ర‌మంలో ప్ర‌స్తుతం సీసీఎస్ ఏసీపీగా ప‌నిచేస్తోన్న‌ కే.శ్రీనివాసరావును సెంట్రల్ డివిజన్ ఇంచార్జీగా సీపీ నియమించినట్లు సమాచారం. 2019 ఎన్నికలకు ముందు విజయవాడ కమిషనరేట్‌కు వచ్చిన నాగరాజారెడ్డి మొదట ట్రాఫిక్ ఏసీపీగా విధులు నిర్వ‌ర్తించారు. అనంతరం అక్కడి నుంచి సెంట్రల్ ఏసీపీ స్థానానికి ట్రాన్స్‌ఫ‌ర్ అయ్యారు. అయితే అతని పనితీరుపై మొదటి నుంచి విమ‌ర్శ‌లు వ‌చ్చిన‌ట్టు సమాచారం.

Also Read :

‘డియర్‌ కామ్రేడ్’ అరుదైన ఘ‌న‌త‌ : ఇండియాలోనే నెం.1

“తాత వల్లే తెలుగు నేర్చుకున్నా”

కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం : ఏపీలో మ‌రో రెండు రోజులు వ‌ర్షాలు