విజయశాంతి బీజేపీ చేరికపై చాలా రోజులుగా సాగుతున్న ఊహాగానాలకు తెరపడనున్నాయి. ఫైర్‌బ్రాండ్ లీడర్ కమలం గూటికి చేరడం డిసెంబర్ 6న చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం విజయశాంతి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌తో కలిసి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి నివాసానికి చేరుకున్నారు. మరికాసేపట్లో విజయశాంతి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను కలిసే అవకాశం ఉంది.
కాగా… జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షడు బండి సంజయ్ విజయశాంతి మంచి నాయకురాలని కొనియాడారు. అంతకు ముందు కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో రాములమ్మ సమావేశమయ్యారు. విజయశాంతి సైతం జీహెచ్ఎంసీ పోలింగ్ రోజున కాషాయపు మాస్క్‌తో దర్శనమిచ్చారు. కాగా, రాష్ట్రంలో బీజేపీ పుంజుకుంటుండడంతో కొందరు కాంగ్రెస్ నేతలు కమలం పార్టీ వైపు చూస్తున్నారు.