టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ‘హింస, విధ్వంస రాజకీయాలకు ఆద్యులు తమరు కాదా చంద్రబాబు గారూ.. పరిటాల రవి ఫ్యాక్షన్ హత్య తర్వాత జిల్లాలకు ఫోన్లు చేసి ఎన్ని బస్సులు తగలబెట్టాలి. ఎవరెవరిపై దాడులు చేయాలో పార్టీ నాయకులకు టార్గెట్ పెట్టిన చరిత్రను మర్చిపోయారా.? రాజకీయ మనుగడ కోసం ఎంత నీచానికైనా దిగజారే స్వభావం మీది’ అంటూ ట్వీట్ చేశారు.
ఇక మరో ట్వీట్‌లో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మద్యం నిషేదిస్తానని చెప్పి.. లిక్కర్ లాబీతో కుమ్మక్కై నిషేదాన్నే ఎత్తేశారు. కానీ జగన్ గారు దశల వారిగా మద్యంపై నిషేధం పెడతానంటే మతి భ్రమించి విమర్శలు చేస్తున్నారని విజయసాయి రెడ్డి మండిపడ్డారు.
ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి సీఎం కుర్చీ లాక్కున్నాక, ఆయన విధించిన మద్యనిషేధాన్ని దేశమంతా అమలు చేయిస్తానని కోతలు కోశారు చంద్రబాబు. ఆ తర్వాత లిక్కర్ లాబీతో కుమ్మక్కై నిషేధం ఎత్తేశారు. జగన్ గారు దశల వారిగా నిషేధం పెడతానంటే మతి భ్రమించిన విమర్శలు చేస్తున్నారు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) July 28, 2019
హింస, విధ్వంస రాజకీయాలకు ఆద్యులు తమరు కాదా చంద్రబాబు గారూ. పరిటాల రవి ఫ్యాక్షన్ హత్య తర్వాత జిల్లాలకు ఫోన్లు చేసి ఎన్ని బస్సులు తగలబెట్టాలి. ఎవరెవరిపై దాడులు చేయాలో పార్టీ నాయకులకు టార్గెట్లు పెట్టిన చరిత్రను మర్చిపోయారా? రాజకీయ మనుగడ కోసం ఎంత నీచానికైనా దిగజారే స్వభావం మీది.
— Vijayasai Reddy V (@VSReddy_MP) July 28, 2019