సేతుపతి హీరోగా క్రికెటర్ మురళీధరన్ బయోపిక్..!

రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో 1983 వరల్డ్‌కప్ హీరో కపిల్ దేవ్ బయోపిక్ ’83’ టైటిల్ పేరిట రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ కోవలోనే శ్రీలంక క్రికెట్ లెజెండ్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ కూడా తెరకెక్కనుంది.

సేతుపతి హీరోగా క్రికెటర్ మురళీధరన్ బయోపిక్..!

Updated on: Aug 19, 2020 | 1:45 PM

Vijay Sethupathi Muralidharan Biopic: తెలుగు నుంచి హిందీ వరకు.. ఏ ఇండస్ట్రీలోనైనా ఇప్పుడు బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. పొలిటికల్ లీడర్ల దగ్గర నుంచి దిగ్గజ క్రికెటర్ల వరకు అందరి బయోపిక్‌లను తెరకెక్కించడానికి దర్శకులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హీరోగా ధోని సినిమా తీయగా.. తాజాగా రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో 1983 వరల్డ్‌కప్ హీరో కపిల్ దేవ్ బయోపిక్ ’83’ టైటిల్ పేరిట రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ కోవలోనే శ్రీలంక క్రికెట్ లెజెండ్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ కూడా తెరకెక్కనుంది.

అయితే ఈ సినిమాను బాలీవుడ్‌లో కాదు.. కోలీవుడ్‌లో రూపొందనుంది. ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి ప్రధాన పాత్ర పోషించనున్నాడు. ఇక ఈ మూవీకి ‘800’ అనే టైటిల్‌ను కూడా ఖరారు చేసినట్లు సమాచారం. మురళీధరన్ అతని టెస్ట్ కెరీర్‌లో 800 వికెట్లు పడగొట్టాడు. దీని ఆధారంగానే టైటిల్‌ను ఖరారు చేశారట. ఈ సినిమా కోసం విజయ్ సేతుపతి బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడట. త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన రానుందని కోలీవుడ్ టాక్. ఈ ఏడాది చివరిలో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం.

Also Read:

తెలంగాణలో విస్తరిస్తున్న కొత్త వైరస్.. ఆందోళనలో రైతులు..

మరో కరోనా లక్షణం.. బాధితుల్లో హెయిర్ లాస్..!

ఏపీలో ఇకపై రిజిస్ట్రేషన్ ప్రక్రియ వీడియో రికార్డింగ్..!

Loading...
Unable to load recommendations.
Follow Us