కరోనా వైరస్‌ను కట్టడి చేయడం కోసం ప్రభుత్వాలు ప్రకటించిన లాక్‌డౌన్‌ను మనం సీరియస్‌గా తీసుకోలేదు.. ఆశీర్వాద్ ఆటాఅనో… ఆగర్‌బత్తీలనో… కరివేపాకనకో బయటకు ఇష్టారాజ్యంగా తిరిగాం! అప్పటికీ ప్రభుత్వాలు గట్టిగానే చెప్పిచూశాయి..! అయినా విన్లేదు.. మన దగ్గరైతే పప్పులుడికాయి కానీ వేరే దేశాల్లో అయితే ఇలా చేస్తే అస్సలు ఊరుకోరు.. డైరెక్ట్‌గా జైల్లోనే తోసేస్తారు.. ఆస్ట్రేలియాలో ఇలాగే జరిగింది.. అక్కడ కరోనా వ్యాప్తి మామూలుగా లేదు.. విక్టోరియా, మెల్‌బోర్న్ వంటి ప్రాంతాలలో అయితే కరోనా విజృంభించేస్తోంది.. అందుకే అక్కడ లాక్‌డౌన్‌ను కఠినాతికఠినంగా అమలు చేస్తోంది ప్రభుత్వం.. నిబంధనలను అతిక్రమించిన వారికి అరదండాలు వేస్తోంది… అయితే లాక్‌డౌన్ విధించడంపై కొందరు రుసరుసలాడారు.. వారంతా కలిసి వీకెండ్‌లో ఓ ర్యాలీ కూడా నిర్వహించారు.. ఆ ర్యాలీలో 28 ఏళ్ల బుహ్లెర్ కూడా పాల్గొంది.. పాల్గొంటే పాల్గొంది కానీ దానికి సంబంధించిన వీడియోలను గొప్పగా సోషల్ మీడియాలో పెట్టింది.. పోలీసుల కళ్లు మామూలుగా ఉండవు కదా! ఆ వీడియోపై పడ్డాయి.. వెంటనే ఆమె ఇంటికెళ్లి ఆమెను అరెస్ట్ చేశారు.. అయ్యా.. ప్రస్తుతం నా శ్రీమతి గర్భవతి అని ఆమె భర్తి మెరపెట్టుకున్నా, ప్రాధేయపడినా పోలీసులు వినలేదు.. ఇహ లాభం లేదనుకుని ఈ అరెస్ట్ వ్యవహారాన్ని లైవ్ స్ట్రీమ్ చేశాడు బుహ్లెర్ భర్త.. ఇది ర్యాలీ వీడియో కంటే ఎక్కువగా వైరలయ్యింది.. పోలీసుల చర్యను నెటిజట్లు తిట్టిపోశారు.. గర్భవతిని అరెస్ట్ చేయడం దారుణమన్నారు.. పోలీసులు మాత్రం అరెస్ట్‌ను సమర్థించుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించినవారిపై ఇలాంటి చర్యలే తీసుకుంటామని హెచ్చరించారు కూడా!